ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైంది : చంద్రబాబు పాత్ర ఉంది

కాంట్రవర్సీ కామెంట్స్ కి, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ రాజకీయాల గురించి, నాయకుల గురించి నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలు

  • Publish Date - September 14, 2019 / 05:56 AM IST

కాంట్రవర్సీ కామెంట్స్ కి, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ రాజకీయాల గురించి, నాయకుల గురించి నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలు

కాంట్రవర్సీ కామెంట్స్ కి, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ రాజకీయాల గురించి, నాయకుల గురించి నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా మరోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైందని జేసీ అన్నారు. అంతేకాదు.. దీనికి వెనుక మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరోక్ష పాత్ర ఎంతోకొంత కచ్చితంగా ఉందని బాంబు పేల్చారాయన. చంద్రబాబు ఆలోచనలపైనే ఏపీలో బీజేపీ ఆధారపడి ఉందని జేసీ అన్నారు. కాగా, ప్రధాని మోడీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికలపైనా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు గండం పొంచి ఉందన్నారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని జేసీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో బీజేపీ బలపడుతోందని, దీని వెనుక చంద్రబాబు పాత్ర ఉందని జేసీ చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. జేసీ వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.