ఆ విషయాన్ని చంద్రబాబు నిరూపిస్తే రాజీనామా చేస్తా : కొడాలి నాని సవాల్

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి గురించి హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని

  • Publish Date - December 17, 2019 / 10:29 AM IST

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి గురించి హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. హైదరాబాద్ అభివృద్ధి గురించి హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన నగరాలను పట్టుకుని.. తానే అభివృద్ది చేశానని చంద్రబాబు అనడం కామెడీగా ఉందన్నారు. మాట్లాడితే.. హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్ కతా అని చంద్రబాబు అంటున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు స్పీచ్ త్వరగా ముగించి మాకు విముక్తి కల్పించాలి అని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు పుట్టక ముందే హైదరాబాద్ మహానగరంగా ఉందని కొడాలి నాని అన్నారు. హైదరాబాద్ లో ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుకు చంద్రబాబు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కొడాలి నాని సవాల్ విసిరారు. ఒకే అబద్దాన్ని పదేపదే చెబితే.. నిజం అవుతుందా? అని కొడాలి నాని ప్రశ్నించారు.

రాజధానిపై చర్చలో మాట్లాడిన చంద్రబాబు.. అమరావతి ప్రజా రాజధాని అన్నారు. అందరినీ సంప్రదించిన తర్వాతే రాజధానిని ఎంపిక చేశామన్నారు. అమరావతి చారిత్రాత్మక ప్రాంతం అన్నారు. భావితరాలకు అమరావతి కలల రాజధానిగా ఉండాలన్నారు. హైదరాబాద్ తరహాలోనే అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నామన్నారు. 13 జిల్లాలకు అమరావతి ఆదాయ వనరు కావాలని ఆకాంక్షించారు. ఉపాధి కల్పనకు కేంద్రంగా రాజధాని ఉండాలన్నారు. 

సైబరాబాద్ నగరానికి నామకరణం చేసింది నేనే అని చంద్రబాబు చెప్పారు. ఎప్పటికైనా హైదరాబాద్ లో నా ముద్ర ఉంటుందన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా 33వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. నేను సృష్టించిన చరిత్ర.. వందేళ్లైనా ఉంటుందన్నారు. హైదరాబాద్ పై ఎప్పటికైనా తన ముద్ర అలాగే ఉంటుందన్నారు. హైదరాబాద్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఎంత కష్టపడ్డానో తనకు తెలుసు అని చెప్పారు.