హుజూర్ నగర్ లో ఫస్ట్ టైమ్ గెలిచి.. కాంగ్రెస్ ను తరిమేద్దాం

హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. నల్గొండలో టీఆర్ఎస్ కేడర్ తో కేటీఆర్ సమావేశం

  • Publish Date - September 23, 2019 / 01:19 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. నల్గొండలో టీఆర్ఎస్ కేడర్ తో కేటీఆర్ సమావేశం

హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. నల్గొండలో టీఆర్ఎస్ కేడర్ తో కేటీఆర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందన్నారు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ ను తరిమికొడతామన్నారు. గులాబీ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నల్గొండను నట్టేట ముంచింది కాంగ్రెస్సే అని కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ దే అని ఆరోపించిన కేటీఆర్.. రైతుబంధు ఇచ్చిన టీఆర్ఎస్ కావాలా, ఫ్లోరైడ్ తెచ్చిన కాంగ్రెస్ కావాలా అని అడిగారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు.

గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు కారులో తగలబడిపోయాయని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. సూర్యాపేటకు మెడికల్ కాలేజీ, భువనగిరికి ఎయిమ్స్ తీసుకొచ్చామన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి బీఫామ్ ఇచ్చారు కేటీఆర్. హుజూర్ నగర్ లో ఫస్ట్ టైమ్ గెలిచి.. మన సత్తా చాటుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు