Minister KTR
KTR Election Campaign : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎం తనయుడైన కేటీఆర్ దూసుకుపోతున్నారు. కేటీఆర్ కేఫ్ లో చాయ్ తాగుతూ, సభల్లో మాస్ డాన్స్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కేటీఆర్ ప్రచారం వినూత్నంగా సాగుతోంది.
పాతబస్తీలో కేటీఆర్ సందడి
పాత బస్తీలో కేటీఆర్ సందడి చేశారు.కేటీఆర్ అర్దరాత్రి ఓల్డ్ సిటీ కి వచ్చి సందడి చేశారు. సాదాసీదా గా పాతబస్తీ లోని ఓ హోటల్ కి వచ్చి బిర్యానీ,పలు రకాల వంటకాలను ఆస్వాదించారు. కేటీఆర్ రావడంతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. ఎలాంటి హడావుడి లేకుండా సడెన్ గా కేటీఆర్ పాతబస్తీకి వచ్చారు. ఐస్ క్రీమ్ తో పాటు మరో హోటల్ లో టీ తాగారు. హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో ఎన్నికల ప్రచారం చేసిన కేటీఆర్ ఉన్నట్టుండి నిలోఫర్ కేఫ్ లోకి వచ్చి చాయ్ తాగుతూ ఓట్ల వేట సాగించారు. ఇటీవల యూట్యూబ్ స్టార్ గంగవ్వతో కలిసి కంట్రీ చికెన్, బగారా రైస్ కేటీఆర్ వండి వారితో కలిసి తింటూ మాట్లాడారు.
KTR
కంట్రీ చికెన్ వండిన కేటీఆర్
కేటీఆర్ వంట వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన కేటీఆర్ సభలో డాన్స్ చేసి ఉర్రూతలూగించారు. ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన సభలో ప్రసంగించే ముందే కేటీఆర్ ఛల్ దేఖ్ లేంగే అంటూ సాగిన పాటకు డాన్స్ అదరగొట్టారు. మరో సభలో రామక్క పాటకు కేటీఆర్ డాన్స్ చేసి కార్యకర్తలను ఆకట్టుకున్నారు.
మాస్ పాటలకు స్టెప్పులేసి…
సిరిసిల్ల నేతన్న మగ్గమా.. మా రామన్న పాటకు దుమ్ములే కేటీఆర్ దుమ్ము లేపారు. అర్దరాత్రి ఓల్డ్ సిటీకి వెళ్ళిన సందడి చేసిన కేటీఆర్సమాజంలో మేధావి వర్గాలను ఆకట్టుకునేందుకు కేటీఆర్ లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ముఖాముఖి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూలో పాల్గొని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సవివరంగా వివరించారు. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ktr tea
తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల గురించి బిల్డర్స్ అసోసియేషన్లు, కాలనీ సంక్షేమ సంఘాలకు వివరించి చెప్పి ఆయా వర్గాల మద్ధతు కూడగడుతున్నారు. కేటీఆర్ శనివారం నుంచి హైదరాబాద్ నగరంలో రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. కేటీఆర్ ప్రచారంలో టీ తాగినా, యువతతో డాన్స్ చేసినా, మాస్ డైలాగులు చెప్పినా ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఓటర్లను తనదైన శైలి ప్రచారంతో ఆకట్టుకుంటున్న కేటీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఓట్ల వేటలో విజయం సాధిస్తారా లేదా అనేది డిసెంబరు 3వతేదీ పోలింగ్ తేదీ వరకు వేచి చూడాల్సిందే.