ప్రత్యేక హోదా కోసం : లాయర్ ఆత్మహత్యాయత్నం

కర్నూలు : ఆత్మకూరులో లాయర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో అనిల్ అనే న్యాయవాది కోర్టు ఆవరణలో పురుగుల

  • Publish Date - February 8, 2019 / 08:35 AM IST

కర్నూలు : ఆత్మకూరులో లాయర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో అనిల్ అనే న్యాయవాది కోర్టు ఆవరణలో పురుగుల

కర్నూలు : ఆత్మకూరులో లాయర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో అనిల్ అనే న్యాయవాది కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 

ఫిబ్రవరి 8వ తేదీ శుక్రవారం యథావిధిగా కోర్టుకు వచ్చారు అనిల్. అందరితో కలిసే ఉన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాత్రం ప్రస్తావిస్తూ వచ్చాడు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏపీకి హోదా విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కోర్టు ఆవరణలోనే పురుగుల మందు తాగేశాడు. కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తోటి లాయర్లు, సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కోర్టులో లాయర్ అనీల్ కు పరుగుల మందు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చర్చ అయ్యింది. ముందస్తుగా ఆయన తన వెంట తెచ్చుకుని ఉంటారని అనుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.