నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు : ఎవరా నమ్మకద్రోహులు

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా

  • Publish Date - January 1, 2020 / 10:11 AM IST

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్గాల్లో వేడి పుట్టించారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారాయి. బుధవారం(జనవరి 1,2020) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈటెల మాట్లాడారు. నాకు కొట్లాడటం తెలుసు.. కానీ.. దొంగ దెబ్బతీయడం తెలియదు అన్నారు.

కోట్లు ఖర్చు చేశాను.. కానీ సంపాదించుకోలేదు అన్నారు. ఎవరి దగ్గర చేయి చాచలేదు అన్నారు. నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగుతుందన్నారు. ప్రజలు ధర్మం తప్పరు, అలా తప్పి ఉంటే నేను గెలిచేవాడిని కాదని ఈటెల చెప్పారు. క్యాంప్ రాజకీయాలు నా వల్ల కాదన్న ఈటెల.. గెలిచిన వాళ్లు విశ్వాసంగా ఉండాలన్నారు.

ఈటెల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు అనే చర్చ అటు విపక్షాలు ఇటు టీఆర్ఎస్ నాయకుల్లో జరుగుతోంది. ఇంతకీ ఈటెల చెప్పిన ఆ నమ్మకద్రోహులు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. 

గతంలోనూ(ఆగస్టు 2019) ఈటెల రాజేందర్ ఈ తరహా కామెంట్స్ చేసి పార్టీ శ్రేణుల్లో కలకలం రేపారు. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు అంటూ గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కోటాలో ఎప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని చెప్పారు. తాను టీఆర్ఎస్‌లోకి మధ్యలో రాలేదని అన్నారు. తాను కూడా గులాబీ జెండా నిర్మాణంలో భాగస్వామినని ఉద్వేగంగా మాట్లాడారు.

టీఆర్ఎస్ జెండా ఓనర్లలో తానూ ఒకడినని స్పష్టం చేశారు.  ఉద్యమ సయమంలో చంపుతామని బెదిరిస్తేనే ఎదురురెళ్లిన వాడినని అన్నారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మరోసారి తాజాగా కాంట్రవర్సీకి తెరలేపారు ఈటెల రాజేందర్. మరి దీనిపై టీఆర్ఎస్ నాయకులు, అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

* హుజూరాబాద్, జమ్మికుంట టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
* హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు స్థానం లేదు
* డబ్బులు, మద్యానికి ఓట్లు పడవు
* నిజాయితీకి, పని చేసే వారికే ప్రజలు ఓట్లు వేస్తారు
* నమ్మకద్రోహం చేసేవారు బాగుపడరు
* క్యాంప్ రాజకీయాలు చేయడం నా వల్ల కాదు
* పార్టీ, కండువా లేకుండా మనం లేదు
* పైసలు ఉంటే టికెట్ రాదు.. పార్టీ, ప్రజలకు సేవ చేస్తే టికెట్ వస్తుంది
* రిజర్వేషన్ల సమయంలో మంత్రుల ప్రమేయం ఉండదు

* తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారితో మనసు గాయపడింది
* అమ్ముడుపోనిది ఆత్మగౌరవం మాత్రమే
* నాయకులను గెలిపించేందుకు కార్యకర్తలు ఎంతో కష్టపడతారు
* జమ్మికుంట, హుజూరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశా

Also Read : కాబోయే సీఎం నేను కాదు