జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేశారని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేశారని అన్నారు. ఉదయం సినిమా కోసం…సాయంత్రం చంద్రబాబు కోసం యాక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ మొన్నటి వరకు బీజేపీని తిట్టి..ఇప్పుడు కాళ్ల బేరానికి వెళ్లారని విమర్శించారు.
సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కేంద్రం అనుమతి అవసరం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాకపై ఒత్తిడి తేవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. జగన్ నిర్ణయాలు నచ్చి రాపాక మద్దతు తెలిపారని పేర్కొన్నారు.