గ్రాండ్ వెల్ కమ్ : ఇంటికి వచ్చిన KTRకు మంగళహారతితో స్వాగతం

  • Published By: madhu ,Published On : January 26, 2020 / 10:48 AM IST
గ్రాండ్ వెల్ కమ్ : ఇంటికి వచ్చిన KTRకు మంగళహారతితో స్వాగతం

Updated On : January 26, 2020 / 10:48 AM IST

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR కీలక పాత్ర ఉంది. పార్టీని ఘన విజయం వైపు నడిపించిన కేటీఆర్‌ 2020, జనవరి 26వ తేదీ రాత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మంగళహారతితో స్వాగతం పలికారు. కూతురు అలేఖ్య బొట్టు పెట్టి హారతి పట్టగా..కూతురు హిమన్షు, సతీమణి శైలిమ స్వీటు తినిపించారు. అలాగే తల్లి కూడా స్వీటు తినిపించి..స్వాగతం పలికారు.

 

తెలంగాణాలో 2020, జనవరి 120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 2020, జనవరి 22వ తేదీ శుక్రవారం పోలింగ్ జరగగా…2020, జనవరి 25వ తేదీ శనివారం కౌంటింగ్ చేపట్టారు. అయితే..మున్సిపల్ ఎన్నికల క్రమంలో మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్లారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నాలుగు రోజుల సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ అక్కడకు వెళ్లిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు హాజరైన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులతో కలిసి కేటీఆర్ వెళ్లారు. అక్కడి నుంచే నేతలకు పలు కీలక సూచనలు చేశారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్‌కు అత్యంత సానుకూల వాతావరణం ఉందని ముందుగానే అంచనా వేశారాయన. 

Read More : రాహుల్, శ్రేయస్ మెరుపులు : 2-0తో టీమిండియా ఆధిక్యం

అనంతరం దావోస్ పర్యటన ముగించుకుని 2020, జనవరి 25వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను తెలంగాణ భవన్ నుంచి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడంపై రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం సాయంత్రం సీఎం కేసీఆర్ జరిపిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ నేరుగా ఇంటికి చేరుకున్నారు. కేటీఆర్‌కు స్వాగతం పలుకుతున్న ఫొటోలను తిరుపతి బండారి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.