బాబుకి బీసీ టెన్షన్ : వంగవీటి రాధాతో లాభమా, నష్టమా
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే 2019, జనవరి నెల 25వ తేదీన ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన చేరిక పార్టీలో అనేక సమస్యలకు కారణమవుతుందని టీడీపీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.

వంగవీటి రాధాకృష్ణ సైకిల్ ఎక్కేందుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. అయితే దశాబ్దాల కాలంగా వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న వైరం రాధా పచ్చ కండువా కప్పుకోవడంతో సర్దుమణుగుతుందా..? లేక ఇంకా ప్రబలుతుందా..? అనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీలో లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా దేవినేని వారసులు మెలుగుతున్నారు. ఇటీవలే దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిని చేశారు. అలాగే దేవినేని బాజీప్రసాద్ కుమారుడు చంద్రశేఖర్ ఎప్పటి నుంచో లోకేష్ టీమ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఓ పక్కన వీరిద్దరూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తుంటే ఇప్పుడు వీరి కుటుంబానికి విరోధైన వంగవీటి రాధాని పార్టీలో చేర్చుకుంటే.. క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాధాది ఎవరితోనూ కలిసిపోయే మనస్తత్వం కాదు. ఈ నేపథ్యంలో దేవినేని వారసులతో కలిసి ఎలా పనిచేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణంగా పార్టీలో ఎవరినైనా చేర్చుకోవాలంటే జిల్లా బాధ్యులు, పార్టీ ముఖ్యనేతల ప్రమేయం ఉంటుంది. కానీ రాధా విషయంలో కృష్ణా జిల్లా నాయకులెవ్వరికీ ఇసుమంత కూడా పాత్ర లేదని సమాచారం. నేరుగా చంద్రబాబే ఈ విషయాన్ని డీల్ చేసి రాధాని టీడీపీలో చేరేటట్లు ఒప్పించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే వంగవీటి రాధాకృష్ణను పార్టీలో చేర్చుకున్న వెంటనే అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 మార్చిలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని వంగవీటి రాధాకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా వంగవీటి రంగా అభిమానులందరినీ టీడీపీ వైపు తిప్పుకోవచ్చనేది చంద్రబాబు ఆలోచన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కాపుల ప్రాబల్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాధా చేత ప్రచారం చేయించాలనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. ఇది కృష్ణా జిల్లా టీడీపీ నేతలను మరీ బాధిస్తోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను విస్మరించి రాధాకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలనుకోవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
వంగవీటి రాధాను టీడీపీలో చేర్చుకోవడం, ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరగడం మరో వర్గంలో కూడా అసంతృప్తిని రాజేస్తోంది. టీడీపీకి ఇంతకాలం వెన్నుదన్నుగా ఉన్న బీసీలు వంగవీటి రాధాకు ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలను ఆ పార్టీలోఉన్న బీసీలే వ్యతిరేకించారు. ఇప్పుడు కేవలం కాపులను ఆకట్టుకోవడానికి రాధాను పార్టీలో చేర్చుకోవడం, ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెతారని జరుగుతున్న ప్రచారం బీసీలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. రాధా టీడీపీ తరపున ప్రచారం చేస్తే బీసీలు దూరమయ్యే ప్రమాదముందని టీడీపీలో సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద వంగవీటి రాధా టీడీపీలో చేరడంపై పార్టీలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రాధా చేరిక టీడీపీకి లాభమో.. నష్టమో తెలియాలంటే ఎన్నికల వరకూ వేచిచూడాలి.