Chandrababu Naidu : ప్రపంచమంతా.. ఏపీ అంటే భయపడే పరిస్థితి తెచ్చారు- సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu : అప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు అవసరమే లేదన్నారు. ఇప్పుడు భోగాపురం ఉత్తరాంధ్రకు కిరీటం, వజ్రం, డైమండ్ అంటున్నారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా..?

Chandrababu Naidu

Chandrababu Naidu : ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ పాలనను దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అన్నారు. ఏపీలో సేఫ్టీ ఉండదనే భయంతో అంతా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రపంచమంతా ఏపీ అంటే భయపడే పరిస్థితిని.. జగన్ తెచ్చారని ధ్వజమెత్తారు. ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమైనా ఉందా? అని ప్రశ్నించారు చంద్రబాబు. కర్నూలు సీడ్ క్యాపిటల్ పెడితే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు.

” ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఓ రకంగా మాట్లాడారు. ఇప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. అప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు అసలు అవసరమే లేదన్నారు. ఇప్పుడు భోగాపురం ఉత్తరాంధ్రకు కిరీటం, వజ్రం, డైమండ్ అంటున్నారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా..? నాడు భోగాపురం ఎయిర్ పోర్టు జగన్ వద్దన్నారు. భూములు తిరిగిచ్చేస్తామన్నారు. ఇప్పుడు అద్భుతం అంటున్నారు.(Chandrababu Naidu)

Also Read..AP Government: సిట్ విచారణకు లైన్‌క్లియర్.. సుప్రీంకోర్టు‌లో ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

కియా ఫ్యాక్టరీ అక్కర్లేదు భూములిచ్చేస్తానన్నారు. ఇప్పుడేమో తన తండ్రే కియా పరిశ్రమ తెచ్చారని చెబుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో 500 ఎకరాల భూమి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఆ భూమినేం చేస్తారో..? రామానాయుడు స్టూడియోకు భూములిస్తే తీసేసుకున్నారు. ప్రపంచం అంతా ఏపీ అంటే భయపడే పరిస్థితికి వచ్చారు. ఏపీలో సేఫ్టీ ఉండదనే భయంతో ఉన్నారు.(Chandrababu Naidu)

ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఒక్క పరిశ్రమైనా ఉంటే చెప్పాలి. కర్నూలు సీడ్ క్యాపిటల్ పెడితే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఏపీలో ఐటీ పెట్టుబడులు కేవలం రూ.1208 కోట్లు. ఇది జాతీయ స్థాయితో పోలిస్తే 0.1 శాతం మాత్రమే. దీని వల్ల ఏపీలో నిరుద్యోగ రేటు 6.15 శాతానికి పెరిగింది. పీజీకి స్కాలర్ షిప్పులు ఇవ్వడం మానేశారు. ఫీజుల కంట్రోల్ పేరుతో ప్రముఖ యూనివర్శిటీలను కంట్రోల్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.(Chandrababu Naidu)

విద్యలో నాణ్యత పడిపోయింది. దీంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎంసెట్ రాస్తున్నారు. ఏపీలో సరైన కాలేజీలు లేవని తెలంగాణ మంత్రులు విమర్శిస్తున్నారు. ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో దేశాన్ని పొగుడుతుంటే ఏపీ మాత్రం వెనక్కు వెళ్తోంది. వ్యవస్థలను పని చేసుకోనిస్తే చాలు. జగన్ ఇంకేం చేయనక్కర్లేదు.(Chandrababu Naidu)

Also Read..Sajjala Ramakrishna Reddy : ఆ కేసులో.. ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్..!- సజ్జల సంచలన వ్యాఖ్యలు

రజనీకాంత్ ను విమర్శిస్తారా..? హైదరాబాద్ చూస్తే ఎవరైనా అదే మాట్లాడతారు. దీనికి విమర్శలా..? మంచి చేస్తే ఎవరైనా పొగుడుతారు. చెడు చేస్తే ఛీ కొడతారు. 1995-96లో ఏపీ గురించి నేనేం చేశానో జగన్ కి ఏం తెలుసు..? ఆ సమయంలో జగన్ గోళీలు ఆడుకుంటున్నారేమో..? యువతా మేలుకో. లేకుంటే భవిష్యత్ ఉండదు. పెట్టుబడులు రాకుంటే కూలీలకు వేతనం కూడా పెరగదు. చదువుకున్న వారే కాదు. చదువుకోని వాళ్లూ జగన్ పాలన గురించి ఆలోచించాలి” అని చంద్రబాబు అన్నారు.(Chandrababu Naidu)