AP Government: సిట్ విచారణకు లైన్‌క్లియర్.. సుప్రీంకోర్టు‌లో ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.

AP Government: సిట్ విచారణకు లైన్‌క్లియర్.. సుప్రీంకోర్టు‌లో ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

Supreme court

AP Government: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌తో దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. ఏపీలో గత ప్రభుత్వ నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సిట్‌‌పై ‘స్టే’ ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు..  బుధవారం తీర్పు ఇచ్చింది. సిట్ దర్యాప్తుకు మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం తీర్పు వెలువరించింది.

AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణంసహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలపై సిట్ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం పిటీషన్‌పై విచారణ సమయంలో  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా, దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వందశాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

CM Jagan : మోదీ ప్రాపకం లేకపోతే బయటపడలేమని బాబు భయం

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ప్రభుత్వం వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో గత ప్రభుత్వంలోని పలు పనులు, తదితర అంశాలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.