Bunny Vasu : అలా చేస్తే అల్లు అరవింద్ తిడతారు.. పాలకొల్లు పంపించేస్తారు మళ్ళీ.. బన్నీ వాసు కామెంట్స్..

10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాసు అల్లు అరవింద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Bunny Vasu)

Bunny Vasu : అలా చేస్తే అల్లు అరవింద్ తిడతారు.. పాలకొల్లు పంపించేస్తారు మళ్ళీ.. బన్నీ వాసు కామెంట్స్..

Bunny Vasu

Updated On : January 4, 2026 / 9:39 PM IST
  • బన్నీ వాసు ఇంటర్వ్యూ
  • అల్లు అరవింద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఆ విషయంలో తిడతారు అన్న బన్నీవాసు

Bunny Vasu : ఒక యానిమేటర్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ అల్లు అరవింద్ కి దగ్గరయి అల్లు అర్జున్ కి క్లోజ్ ఫ్రెండ్ అయి, అతనితో పని చేసి బన్నీ వాసు గా మారాడు. అల్లు అరవింద్, గీత ఆర్ట్స్ ఫ్యామిలిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు బన్నీ వాసు. అల్లు అరవింద్ కూడా బన్నీ వాసుని అంతగా నమ్మి తన సంస్థలో సినిమాలు ఆయనకు అప్పచెప్తున్నారు.(Bunny Vasu)

తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాసు అల్లు అరవింద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పిన హైపర్ ఆది.. ఫ్యాన్స్ ఇది అస్సలు మిస్ అవ్వకండి..

బన్నీ వాసు మాట్లాడుతూ.. నేను సినిమాలు కాకుండా వేరే వాటికి వెళ్తే అల్లు అరవింద్ గారు కన్నెర్రజేస్తారు. పాలకొల్లు పంపించేస్తారు మళ్ళీ నన్ను(నవ్వుతూ..). నాకు యాక్టింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయింది. అప్పుడప్పుడు అక్కడ ఆ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉంది అని చేయాలనిపించి ఆయనతో మాట్లాడితే ఆయన కోప్పడతారు. ఇక్కడ ఫోకస్ చెయ్ అంటారు. నేను ఫోకస్ చేసే సినిమాలు బాగుంటాయి అని అయన నమ్మకం. అందుకే ఒకే దాని మీద, సినిమాల మీదే ఫోకస్ చేయమంటారు. ఆయన నాకు తండ్రి కంటే ఎక్కువ అని తెలిపారు.

Also Read : Allu Arjun : గంగోత్రి విషయంలో బాధపడ్డ అల్లు అర్జున్.. ఆ రోజే చెప్పాడు.. బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్..