Allu Arjun : గంగోత్రి విషయంలో బాధపడ్డ అల్లు అర్జున్.. ఆ రోజే చెప్పాడు.. బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్..

బన్నీ వాసు 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగోత్రి సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపాడు. (Allu Arjun)

Allu Arjun : గంగోత్రి విషయంలో బాధపడ్డ అల్లు అర్జున్.. ఆ రోజే చెప్పాడు.. బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్..

Allu Arjun

Updated On : January 4, 2026 / 8:58 PM IST
  • బన్నీ వాసు ఇంటర్వ్యూ
  • గంగోత్రి చూసి అల్లు అర్జున్ పై విమర్శలు
  • బాధపడ్డ అల్లు అర్జున్

Allu Arjun : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ అయినా అల్లు అర్జున్ లుక్స్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. ఇతను హీరో ఏంటి, ఇలాంటి ఆడ వేషం వేయడం ఏంటి, చిరంజీవి అల్లుడు ఇతనా అని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ బన్నీ ఆ తర్వాత సినిమా సినిమాకు మారుతూ స్టైలిష్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు ఇండియాలో ఐకాన్ స్టార్ గా ఎదిగి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు కూడా సాధించాడు.(Allu Arjun)

తాజాగా అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగోత్రి సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపాడు.

Also Read : Roja : అందుకే ఆ రోజు జబర్దస్త్ కి రోజా రాలేదు.. నాగబాబుతో విబేధాలు..? హైపర్ ఆది క్లారిటీ..

బన్నీ వాసు మాట్లాడుతూ.. గంగోత్రి సినిమా నేను, బన్నీ కలిసి ఓ థియేటర్ లో చూసాము. బన్నీ క్యాప్ పెట్టుకొని గుర్తుపట్టకుండా వచ్చారు. బ్రేక్ లో బయటకు వచ్చాము. జనాలు సినిమా బాగున్నా హీరో మీద, హీరో లుక్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ సినిమా గురించి ఏమంటున్నారు అని అవన్నీ వింటూ ఉన్నాడు. కార్ ఎక్కి వెళ్ళేటప్పుడు బాధపడుతున్నాడు.

నాకు అర్థమయి సినిమా బాగుంది సర్ అని మాట్లాడటానికి ట్రై చేస్తే సినిమా బాగుంది కానీ నేను బాగోలేను అన్నాడు ఆయనే. ఏదో ఒక రోజు ఇండియాలో నేను బిగ్గెస్ట్ స్టార్ అవుతాను అని ఆ రోజే చెప్పాడు. గంగోత్రి రిలీజ్ రోజే ఈ మాట చెప్పాడు బన్నీ. మరీ ఎక్కువ తీసుకున్నాడు ఆ మాటలు అనుకున్నాను అప్పుడు. అక్కడ్నుంచి డెడికేటెడ్ గా మారి కింద మీద పడి ఎదిగాడు. పుష్ప 2 చీర సీన్, సాంగ్ థియేటర్ లో చూసినప్పుడు నాకు ఆ గంగోత్రి రిలీజ్ రోజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

లంగావోణీ వేస్తే అల్లు అర్జున్ ని కామెంట్ చేసారు. 20 ఏళ్ళ తర్వాత అదే అల్లు అర్జున్ చీర కడితే క్లాప్స్ కొట్టారు. ఆయన డెడికేషన్ అది. ఇప్పటికి కూడా క్యాప్, మాస్క్ అన్ని పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా థియేటర్స్ లో వెళ్లి సినిమా చూసి జనాలు ఏమనుకుంటున్నారా అని తెలుసుకుంటాడు బన్నీ అని తెలిపారు.

Also See : Singer Smita : భీమవరంలో పాప్ సింగర్ స్మిత.. రఘురామ కృష్ణరాజుతో కలిసి సంక్రాంతి సంబరాల్లో.. ఫొటోలు..