Roja : అందుకే ఆ రోజు జబర్దస్త్ కి రోజా రాలేదు.. నాగబాబుతో విబేధాలు..? హైపర్ ఆది క్లారిటీ..
తాజాగా హైపర్ ఆది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. (Roja)
Roja
- హైపర్ ఆది ఇంటర్వ్యూ
- జబర్దస్త్ కి రోజా ఎందుకు రాలేదు
- క్లారిటీ ఇచ్చిన ఆది
Roja : నటి రోజా తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా ఏళ్ళు జబర్దస్త్ లో జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చాక రోజా జబర్దస్త్ వదిలేసింది. అంతకుముందే నాగబాబు కూడా జబర్దస్త్ వదిలేసారు. ఆ షోలో నాగబాబు – రోజా చక్కగా ఉండి ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు. బయట వేర్వేరు పార్టీలు కావడంతో విమర్శలు కూడా చేసుకున్నారు రాజకీయాల్లో.(Roja)
రోజా ప్రస్తుతం మళ్ళీ వేరే షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. అయితే ఇటీవల జబర్దస్త్ 12 ఏళ్ళ వేడుకలు చేయగా పాత టీమ్ లీడర్లు, యాంకర్లు, నాగబాబు కూడా వచ్చారు కానీ రోజా రాలేదు. వేరే టీవీ షోలకు వెళ్తున్నా జబర్దస్త్ కి ఎందుకు రాలేదు, నాగబాబు ఉండటం వల్లే రాలేదు అని కామెంట్స్ వచ్చాయి.
తాజాగా హైపర్ ఆది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. జబర్దస్త్ కి రోజా గారు ఆ రోజు రాలేదు. ఆ రోజు వేరే ఏదో షెడ్యూల్ ఉంది ఆవిడకు. జబర్దస్త్ వాళ్ళు పిలిచారు కానీ వేరే షెడ్యూల్ ఉండటం వల్లే రాలేదు. నాగబాబు గారి వల్ల కాదు. రాజకీయాలు వేరు, ఇది వేరు. వాళ్ళు కూడా అలాగే ఉంటారు. బయట మాట్లాడేవి బయటే. ఇక్కడ స్కిట్స్ కి సంబంధించి మాత్రమే మాట్లాడతారు. అందరికి అదే చెప్తున్నా అందరూ తెలుసుకోవాలి రాజకీయాలు, జబర్దస్త్ కలిపి చూడకండి. ఇది వేరు అది వేరు. ఇక్కడ బాగానే ఉంటారు. రాజకీయాల్లో వారి వారి పార్టీల బట్టి విమర్శలు చేస్తారు అని అన్నాడు. మరి భవిష్యత్తులో అయినా రోజా మళ్ళీ జబర్దస్త్ కి వస్తుందా చూడాలి.
Also See : Singer Smita : భీమవరంలో పాప్ సింగర్ స్మిత.. రఘురామ కృష్ణరాజుతో కలిసి సంక్రాంతి సంబరాల్లో.. ఫొటోలు..
