Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పిన హైపర్ ఆది.. ఫ్యాన్స్ ఇది అస్సలు మిస్ అవ్వకండి..
హైపర్ ఆది ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Pawan Kalyan)
Pawan Kalyan
- హైపర్ ఆది ఇంటర్వ్యూ
- పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం
- హైపర్ ఆది కామెంట్స్ వైరల్
Pawan Kalyan : హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా జనసేన తరపున ప్రచారం చేసారు. పవన్ కళ్యాణ్ ముందే హైపర్ ఆది మాట్లాడిన పొలిటికల్ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఆది స్పందిస్తాడు. తాజాగా హైపర్ ఆది ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Pawan Kalyan)
Also Read : Allu Arjun : గంగోత్రి విషయంలో బాధపడ్డ అల్లు అర్జున్.. ఆ రోజే చెప్పాడు.. బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్..
హైపర్ ఆది మాట్లాడుతూ..
పవన్ కళ్యాణ్ గారు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గుణవంతుడు.
ఆయన వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉంటాడు.
నేను నమ్మిన నాయకుడు సీట్ల విషయంలో తగ్గి ఉండొచ్చు కానీ అభివృద్ధి విషయంలో తగ్గడు.
నేను నమ్మిన నాయకుడు కార్యకర్తలకు ఎప్పుడూ దూరం కాదు. అది వైసీపీ అయినా జనసేన కార్యకర్త అయినా అందర్నీ ఈక్వల్ గా చూస్తాడు. కేవలం భూతులు మాట్లాడే నాయకులకు మాత్రమే వ్యతిరేకం.
నేను నమ్మిన నాయకుడు జనాభా లెక్కల్లో ఒకడు కాదు లెక్క లేనంత జనాభాకు ఒకే ఒక్కడు.
మన్యం ప్రజల గురించి ఆలోచించింది ఇద్దరే ఇద్దరు. ఒకటి అల్లూరి సీతారామరాజు, ఇంకోటి పవన్ కళ్యాణ్.
ఆయనతో పోలిస్తే మనం ఎంత ఆయనకు వచ్చే నెగిటివిటి మనకు రాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురానికి దొరకడం వాళ్ళ అదృష్టం. సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామే పవన్ కళ్యాణ్ ని పిఠాపురానికి రప్పించాడు గెలిపించాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారు. ఆయనను అసలు ఒక మాట అనడానికి ఎలా నోరు వస్తుందో. జనసేన నుంచి గెలిచి, పదవులు తీసుకున్న వాళ్ళందర్నీ పిలిచి ప్రమాణం చేయించారు. అలా ఎవరు చేస్తారు.
అలాంటి గొప్ప నాయకుడు గురించి ఎవడైనా మాట్లాడితే అవతలివాడు ఎంత పెద్దవాడైన వాళ్ళను తిట్టడానికి నేను కూడా రెడీ. మా అమ్మ నాన్న తర్వాత అభిమానించేది పవన్ కళ్యాణ్ గారినే. నేను ఎన్ని సార్లు కలిసినా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఒకరకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆయన చెప్పేది వింటూనే ఉంటాను. ఈ రోజుల్లో ఆయనకు మించిన నిజాయితీపరుడు చూడలేదు. ఆయన వల్ల అందరూ మారతారు. కానీ ఆయన ఎవరి వల్ల మారడు. ఉచిత విద్య, ఉచిత వైద్యం వస్తే ప్రజలు బాగుపడతారు. అది ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకం ఉంది అని అన్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ పై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు.
