Bunny Vasu : ఎప్పటికైనా నా కోరిక అదే.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో.. బన్నీ వాసు కామెంట్స్ వైరల్..

నిర్మాత బన్నీ వాసు అటు అల్లు అర్జున్ కి క్లోజ్, ఇటు పవన్ కళ్యాణ్ కి క్లోజ్. (Bunny Vasu)

Bunny Vasu : ఎప్పటికైనా నా కోరిక అదే.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో.. బన్నీ వాసు కామెంట్స్ వైరల్..

Bunny Vasu

Updated On : January 4, 2026 / 10:12 PM IST

Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు అటు అల్లు అర్జున్ కి క్లోజ్, ఇటు పవన్ కళ్యాణ్ కి క్లోజ్. గంగోత్రి సినిమా నుంచే అల్లు అర్జున్ తో నడుస్తూ తన పేరునే బన్నీ వాసుగా మార్చేసుకున్నాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఇండస్ట్రీకి వచ్చి జల్సా నుంచి ఆయనతో ప్రయాణం చేస్తూ జనసేనలో ప్రచార బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదిగారు బన్నీ వాసు.(Bunny Vasu)

తాజాగా 10 టీవీ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీకంటూ ఏదైనా కోరిక ఉందా, తీరని కల ఉందా అని అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పారు.

Also Read : Bunny Vasu : అలా చేస్తే అల్లు అరవింద్ తిడతారు.. పాలకొల్లు పంపించేస్తారు మళ్ళీ.. బన్నీ వాసు కామెంట్స్..

బన్నీ వాసు మాట్లాడుతూ.. బన్నీ గారితో డైరెక్ట్ నిర్మాతగా చేయాలి. ఏ రోజుకైనా కళ్యాణ్ గారితో కూడా నిర్మాతగా సినిమా చేయాలి. నిర్మాతగా సింగిల్ కార్డు పడాలి. వాళ్ళిద్దరితో సినిమాలు సింగిల్ నిర్మాతగా చేయాలి. కానీ జరుగుద్దో లేదో చూడాలి. ఎలాంటి స్టోరీ చేయాలి అని కూడా అనుకున్నాను. వాళ్ళ కెరీర్ బెస్ట్ ఇవ్వాలి. దేవుడు రాసి పెడితే జరుగుతుంది అని తెలిపారు.

పవన్ ఏమో రాజకీయాల్లో బిజీ ఉన్నారు, సినిమాలు చేస్తారో లేదో క్లారిటీ లేదు. ఇక బన్నీ ఏమో అన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బన్నీతో సినిమా చేయాలంటే వందల కోట్లు కావాల్సిందే. మరి ఈ ఇద్దరితో సింగిల్ కార్డు నిర్మాతగా బన్నీ వాసు కల నెరవేరుతుందా చూడాలి.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పిన హైపర్ ఆది.. ఫ్యాన్స్ ఇది అస్సలు మిస్ అవ్వకండి..