Robert Kiyosaki: ఈరోజుల్లో డబ్బు ఆదా చేయొద్దు, బదులుగా ఇలా చేయండి.. ప్రముఖ రచయిత కియోసాకి కీలక సలహా

ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి తీవ్ర చర్చకు దారితీయబోయే మరో వివాదాస్పద ప్రకటనతో 2026 సంవత్సరాన్ని ప్రారంభించారు. Robert Kiyosaki

Robert Kiyosaki: ఈరోజుల్లో డబ్బు ఆదా చేయొద్దు, బదులుగా ఇలా చేయండి.. ప్రముఖ రచయిత కియోసాకి కీలక సలహా

Robert Kiyosaki Representative Image (Image Credit To Original Source)

Updated On : January 4, 2026 / 9:08 PM IST

 

  • ఉద్యోగ భద్రత ఎక్కడుంది
  • డబ్బును ఆదా చేయకండి
  • ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి
  • విలువను పెంచే వస్తువుల్లో డబ్బును పెట్టుబడిగా పెట్టండి

Robert Kiyosaki: బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. జాబ్ ఉంటేనే లైఫ్ లాంగ్ బతుక్కి భరోసా ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందరూ నమ్మే సిద్ధాంతం. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కూడా గతంలోనే ఇలా చెప్పారు. కట్ చేస్తే.. ఇప్పుడాయన మాట మార్చారు. ఉద్యోగం ఉంటే జీవితాంతం భద్రత ఉంటుందనే అనే మాటను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారాయన.

డబ్బును ఆదా చేయొద్దు..

ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయని కియోసాకి అన్నారు. 2025లో దిగ్గజ టెక్ కంపెనీలే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయని, ఇక ఉద్యోగ భద్రత ఎక్కడుందని, అందుకే మీ ఫైనాన్షియల్ ఐక్యూని (ఆర్థిక పరిజ్ఞానం) పెంచుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు డబ్బును సేవ్ చేయడం పాత ఐడియా అన్నారు. ఎప్పుడూ కూడా డబ్బును సేవ్ చేయకండి.. అందుకు బదులుగా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి వాటిని ఆదా చేయండి, అవే మిమ్మిల్ని ధనవంతులను చేస్తాయని సలహా ఇచ్చారాయన.

ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి తీవ్ర చర్చకు దారితీయబోయే మరో వివాదాస్పద ప్రకటనతో 2026 సంవత్సరాన్ని ప్రారంభించారు. ఈ రోజుల్లో ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడంలో నిజంగా అర్థం లేదు అంటూ ఆయన చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. ఆయన అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. అంతేకాదు.. 2025లో ఏయే టెక్ కంపెనీలు ఎన్ని వేల మంది ఉద్యోగులను తొలగించాయో కూడా వివరాలు తెలిపారు.

Gold

Gold Representative Image (Image Credit To Original Source)

2025లో పెద్ద పెద్ద టెక్ కంపెనీలే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయని, మరి ఉద్యోగ భద్రత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కంపెనీ ఎంత పెద్దదైనా కావొచ్చు.. మనకు ఉద్యోగ భద్రత కల్పించదని తేల్చి చెప్పారు. ఎప్పుడు జాబ్ నుంచి తొలగిస్తారో తెలియదన్నారు.

విలువు పెంచే వస్తువుల్లో పెట్టుబడి పెట్టాలి..

అందుకే, జాబ్ పై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పని చేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోవాలన్నారు. అంతేకాదు డబ్బు సేవ్ చేయకండి అని ఎందుకు అంటున్నాను అంటే.. డబ్బును బ్యాంకులో ఉంచితే విలువ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువుల్లో (గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, ఇథీరియం) పెట్టుబడిగా పెట్టాలన్నారు. ఉద్యోగ భద్రత కోసం స్కూల్ కి వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అని కియోసాకి ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం అన్నదే ఆయన అభిప్రాయం.

Also Read: భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్‌ వచ్చేసింది.. ఇక భవిష్యత్తులో రోగులు అందరూ