Hyper Aadi : హీరోగా రాబోతున్న హైపర్ ఆది..? మూడు కోట్లతో నా దగ్గరికి వచ్చి.. ఆది కామెంట్స్ వైరల్..
చాలా మంది కమెడియన్స్ హీరోలు అయిన సంగతి తెలిసిందే.(Hyper Aadi)
Hyper Aadi
- హైపర్ ఆది ఇంటర్వ్యూ
- హీరోగా ఛాన్సులు
- అలాంటి సినిమాలు చేయాలన్న ఆది
Hyper Aadi : జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అనంతరం టీమ్ లీడర్ గా ఎదిగి ఫేమ్ తెచ్చుకున్నాడు. రైటర్ గా, కమెడియన్ గా సినీ, టీవీ పరిశ్రమలో ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. చేతి నిండా టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉన్నాడు ఆది. సినిమాల్లో కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాడు.(Hyper Aadi)
చాలా మంది కమెడియన్స్ హీరోలు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది తనకు కూడా హీరో ఛాన్సులు వస్తున్నాయనే విషయం తెలిపారు.
Also Read : Bunny Vasu : అలా చేస్తే అల్లు అరవింద్ తిడతారు.. పాలకొల్లు పంపించేస్తారు మళ్ళీ.. బన్నీ వాసు కామెంట్స్..
హైపర్ ఆది మాట్లాడుతూ.. హీరోగా కూడా ఛాన్సులు వచ్చాయి కానీ రిజెక్టు చేశా. నా ఫేమ్, నా ఫ్యాన్స్, వ్యూయర్ షిప్ చూసి కొంతమంది వచ్చారు. రెండు మూడు కోట్లతో సినిమాలు చేద్దామని కొన్ని కథలు తీసుకొని వచ్చారు. కానీ నేను వాళ్ళను పంపించేసాను. ఆ మూడు కోట్లు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పాను. ఆ కంటెంట్ కి సరిపోయే వాళ్ళు, మీ డబ్బులకు కనీసం పది రూపాయలు లాభం వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను. ఆ డబ్బులు మీరు పోగొట్టుకొకూడదు అని చెప్పాను.
నా బాడీకి ఫైట్స్, సాంగ్స్ చేస్తే చూడరు అని చెప్తాను. ఒకవేళ నేను హీరోగా చేయాలి అనిపిస్తే మలయాళం హీరో బసిల్ జోసెఫ్ లాగా పాటలు, ఫైట్స్ లేకుండా కేవలం కంటెంట్ ఉండే సినిమాలు అయితేనే చేస్తాను అని తెలిపారు. మరి భవిష్యత్తులో హైపర్ ఆది అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలతో హీరోగా వస్తాడేమో చూడాలి.
Also Read : Allu Arjun : గంగోత్రి విషయంలో బాధపడ్డ అల్లు అర్జున్.. ఆ రోజే చెప్పాడు.. బన్నీ వాసు వ్యాఖ్యలు వైరల్..
