Kishan Reddy : లక్షలాది మంది చేరుతున్నారు, తెలంగాణలో బలపడుతోంది- కిషన్ రెడ్డి

Kishan Reddy : నాయకులు చేరితేనే ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజలు మార్పు కోరుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. సౌత్-నార్త్ అంటూ ముడి పెట్టొద్దు.

Kishan Reddy – BJP : తెలంగాణలో బీజేపీ బలపడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లక్షలాది మంది యువత బీజేపీలో చేరుతోందని చెప్పారు. బీజేపీలో చేరిన వారు మళ్లీ వెళ్లిపోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ ల కుట్ర అన్నారు. బీజేపీలో చేరిన వాళ్లు ఎవరూ బయటకి వెళ్లరని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ డీలా పడింది అనడంలో వాస్తవం లేదన్నారు. బీజేపీ నిరాశ నిస్పృహలో లేదని స్పష్టం చేశారు.

సౌత్-నార్త్ లింక్ వద్దు:
”పార్లమెంట్ స్థానాల పెంపు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్ కట్టాం. లోక్ సభ స్థానాల పెంపు రాజ్యాంగపరమైన ప్రక్రియ. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ప్రధాని మోదీ చేసేదేమీ లేదు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ భావజాలం గల ప్రభుత్వం. సౌత్ -నార్త్ ముడి పెట్టొద్దు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ప్రధానులు, రాష్ట్రపతులు అయ్యారు.(Kishan Reddy)

Also Read..MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

బీజేపీ నిరాశ, నిస్పృహలో లేదు:
బీజేపీలో చేరిన వారు ఎవరూ బయటికి వెళ్ళరు. బీజేపీలో చేరిన వాళ్లు మళ్లీ వెళ్లిపోతారని తప్పుడు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతోంది. రాష్ట్రంలో లక్షలాది మంది యువత బీజేపీలో చేరుతోంది. నాయకులు చేరితేనే ప్రభుత్వాలు ఏర్పడవు. ప్రజలు మార్పు కోరుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి చేరిన వారు పార్టీలోనే ఉంటారు. కొందరు చేరనంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం కలగదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ డీలా పడలేదు. బీజేపీ నిరాశ నిస్పృహకి లోనయ్యే పార్టీ కాదు. ఈటల రాజేందర్ పార్టీ వీడటం లేదు. ఆ వార్తలను ఖండిస్తున్నా” అని కిషన్ రెడ్డి అన్నారు.

ఏపీ, తెలంగాణ పట్టింపులకు పోవద్దు:
ఇక, సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు కిషన్ రెడ్డి. పట్టింపులకు పోవద్దని చెప్పారు. ఏపీ, తెలంగాణ విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేసిందని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడుతూనే ఉందని ఆయన గుర్తు చేశారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు.(Kishan Reddy)

ఢిల్లీలో ఉన్న భవన్ విభజనపై చర్చలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని, పట్టింపులకు పోరాదని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read..KTR tweet on Meenakshi Lekhi : ‘భాగ్ మంత్రి భాగ్’ ఎప్పుడూ వినలేదు.. మీనాక్షి లేఖి పరుగుపై కేటీఆర్ సెటైర్

ఈసారి గోల్కొండ కోటలో వేడుకలు:
”దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. గతేడాది ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాం. ఈసారి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు అధికారికంగా గోల్కొండ కోటలో నిర్వహిస్తాం. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తాం” అని కిషన్ రెడ్డి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు