KTR tweet on Meenakshi Lekhi : ‘భాగ్ మంత్రి భాగ్’ ఎప్పుడూ వినలేదు.. మీనాక్షి లేఖి పరుగుపై కేటీఆర్ సెటైర్

రెజ్లర్లపై మీడియా ప్రశ్నించినపుడు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తే ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మంత్రి పరుగులు పెట్టడం ఎప్పుడూ వినలేదంటూ సెటైర్ వేశారు.

KTR tweet on Meenakshi Lekhi : ‘భాగ్ మంత్రి భాగ్’ ఎప్పుడూ వినలేదు.. మీనాక్షి లేఖి పరుగుపై కేటీఆర్ సెటైర్

KTR tweet viral

Updated On : May 31, 2023 / 5:13 PM IST

KTR tweet viral : రెజర్ల నిరసనలపై స్పందించమంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగుల తీసిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

KTR Tweet : థాంక్స్ పప్పు, కేటీఆర్ ట్వీట్ వైరల్

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని నెలరోజులుగా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. నిరసనను తీవ్రతరం చేస్తూ తమ పతకాలను సైతం గంగానదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి మీడియా కంటపడ్డారు. రెజ్లర్ల సమస్యలపై స్పందించాల్సిందిగా విలేఖరి ప్రశ్నించినపుడు ఆమె తప్పించుకుని పరుగులు తీసిన వీడియో వైరల్ అయ్యింది.

 

‘చలో చలో’ అంటూ మంత్రి తన కారువైపు పరుగులు తీశారు. విలేఖరి ఆమె వెంటే పరుగులు తీస్తుంటే ఆ సమస్యను చట్టం చూసుకుంటుందంటూ తప్పించుకున్నారు.  ఇక ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ‘నేను భాగ్.. మిల్కా.. భాగ్ గురించి విన్నాను.. ఈ భాగ్ మంత్రి భాగ్ ఏంటి? మీ దగ్గర సమాధానం లేనప్పుడు  ప్రెస్‌ని, పబ్లిక్‌ని ఎదుర్కొనలేరు’ అనే క్యాప్షన్‌తో కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

KTR Tweet: మోదీజీ మీరైనా ఆ పనిచేయండి.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించండి.. మంత్రి కేటీఆర్ ట్వీట్

ఇక రెజ్లర్ల అంశంలో బ్రిజ్ భూషణ్ తనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని, ఏమీ చేయలేరని అన్నారు. ‘ఏం జరుగుతుందో చూద్దాం? నా పదవీ కాలం ముగిసింది.. నేను దోషిగా తేలితే నన్ను అరెస్టు చేస్తారు.. దానితో సమస్య ఏంటని’ చెప్పడం గమనార్హం.