MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

నిజామాబాద్‌లో అరుదైన రాజకీయ దృశ్యం.. బండి సంజయ్, కవిత మాట్లాడుకున్నారు.

MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఏం జరిగిందంటే?

MLC Kavitha Kalvakuntla, BJP MP Bandi Sanjay

Updated On : May 31, 2023 / 3:43 PM IST

MLC Kavitha – Bandi Sanjay: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత ఓ శుభకార్యంలో ఎదురుపడ్డారు. అంతేగాక వారిద్దరు పలకరించుకోవడం, తమ స్థానిక నేతలను పరస్పరం పరిచయం చేసుకోవడం గమనార్హం.

ఈ అరుదైన రాజకీయ దృశ్యం బీజేపీ నిజామాబాద్ అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో కనపడింది. ఈ వేడుకకు బండి సంజయ్, కవిత హాజరయ్యారు. జిల్లా నేతలను బండి సంజయ్ కు పరిచయం చేశారు ఎమ్మెల్సీ కవిత.

బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వేళ ఇరు పార్టీల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం మరింత పెరిగిన విషయం తెలిసిందే. అంతేగాక, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉండడం, ఆమెను సీబీఐ, ఈడీ విచారించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

బీజేపీపై కవిత కొన్ని వారాలుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్ లో గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో కవిత ఓడిపోయారు. కొన్ని నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇన్ని రాజకీయ విభేదాలు ఉండి కూడా బండి సంజయ్, కవిత మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.


Yerragondapalem Constituency: యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ