ప్రకాశం : పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ చీఫ్ జగన్‌ను ఎన్టీ రామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలవడంపై పర్చూరు వైసీపీ నాయకులు,
ప్రకాశం : పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ చీఫ్ జగన్‌ను ఎన్టీ రామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలవడంపై పర్చూరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. పర్చూరులో నియోజకవర్గ స్థాయి కన్వీనర్లు, కార్యకర్తలు భేటీ అయి దగ్గుబాటిని వైసీపీలోకి ఆహ్వానించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దగ్గుబాటి చేరికను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. సమాచారం ఇవ్వకుండా దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు సీటుని రావి రామనాథంబాబుకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
* వేడెక్కిన పర్చూరు రాజకీయాలు
* జగన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలవడంపై పర్చూరు వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి
* పర్చూరులో నియోజకవర్గ స్థాయి కన్వీనర్లు, కార్యకర్తలు భేటీ
* దగ్గుబాటిని వైసీపీలోకి ఆహ్వానించడంపై ఆగ్రహం
* దగ్గుబాటి చేరికను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
* సమాచారం ఇవ్వకుండా దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించడంపై నేతల ఆగ్రహం
దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తన రాజకీయ వారసుడు హితేశ్‌తో కలిసి.. వైసీపీ చీఫ్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కొడుకు హితేశ్ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరడానికి ఆయన డిసైడ్ అయ్యారు. హితేశ్‌కు పర్చూరు ఎమ్మెల్యే సీటుతో పాటు.. పురంధేశ్వరికి ఎంపీ టికెట్ ఇవ్వాలని దగ్గుబాటి అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌తో భేటీ తర్వాత వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేస్తారని దగ్గుబాటి తెలిపారు. కుమారుడి రాజకీయ అరంగేట్రానికి అడ్డంకి అయ్యే పరిస్థితుల్లో పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. పైగా పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పారు.
దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరితే కమ్మ సామాజికవర్గంలో పట్టు చిక్కుతుందన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌ను కలవడం పర్చూరు వైసీపీ నాయకులకు కోపం తెప్పించింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి రాకను వారు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ ఇష్యూని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.