Congress Lok Sabha Candidates List
Congress MP Candidates : లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది. ఏ స్థానం నుంచి ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలి అనేదానిపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల విషయంలో పీఈసీ సభ్యుల అభిప్రాయాలు నమోదు చేశారు. అన్ని నియోజకవర్గాల నుండి బలమైన జాబితాను పీఈసీ వడబోసింది. పీఈసీ సమావేశంలో తెలంగాణలో 15 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 17 లోక్ సభ స్థానాల కోసం 309 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 48 దరఖాస్తులు, అత్యల్పంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పీఈసీలో చర్చించారు.
Also Read : మెదక్ లోక్‌సభ స్థానంపై మైనంపల్లి హనుమంతరావు ఫోకస్.. ఏం జరుగుతుందో తెలుసా?
తెలంగాణలో మొత్తం 17 పార్లెమెంట్ స్థానాలు ఉంటే.. 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని బలమైన నాయకుల పేర్లు కూడా పీఈసీలో చర్చించారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు లేదా నాలుగు అభ్యర్థుల పేర్లను సూచించాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ ఎవరెవరి పేర్లను పరిశీలించారు? ఎవరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి? ఎంపీ టికెట్ కోసం పోటీపడుతున్న ఆశావహులు ఎవరెవరు? వారి బలాబలాలు ఏంటి? ఇన్ డెప్త్ అనాలసిస్..
ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహులు..(నియోజకవర్గాల వారీగా..)
1. వరంగల్ (ఎస్సీ) – అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య , మోత్కుపల్లి నర్శింహులు
2. నాగర్ కర్నూల్ (ఎస్సీ)
సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్
3. ఆదిలాబాద్ (ఎస్టీ) –
నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, రేఖా నాయక్
4.మహబూబాబాద్ (ఎస్టీ) –
బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయ బాయి
5.. ఖమ్మం (జనరల్)
రేణకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహెచ్, మల్లు నందిని / (సోనియా గాంధీ)
6. హైదరాబాద్ (జనరల్)
సమీర్ ఉల్లా ,సూరం దినేష్ ,ఆనంద్ రావు (ఎంబీటీ)
7. కరీంనగర్ (జనరల్)
ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు , నేరెళ్ల శారద
8.. పెద్దపల్లి (ఎస్సీ ) –
గడ్డం వంశీ, వెంకటేశ్ నేత
9. నిజామాబాద్ (జనరల్) ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ),సునీల్ రెడ్డి (ఆరెంజ్ ట్రావెల్స్ )
10. మెదక్ (జనరల్) జగ్గారెడ్డి, ,మైనంపల్లి హన్మంతరావు
11. జహీరాబాద్ (జనరల్)
సురేష్ షెట్కార్, త్రిష (మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె ), శ్రీకాంత్ రావు
12. మల్కాజిగిరి (జనరల్) బండ్ల గణేష్ ,హరివర్ధన్ రెడ్డి,సర్వే సత్యనారాయణ
13. సికింద్రాబాద్ (జనరల్)
అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, విద్యా స్రవంతి
14. చేవెళ్ల (జనరల్)
చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, దామోదర్ అవేలీ
15. మహబూబ్ నగర్ (జనరల్) వంశీ చంద్ రెడ్డి ,
జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా), సీతాదయాకర్ రెడ్డి,
16. నల్గొండ (జనరల్)
జానారెడ్డి ,రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కొడుకు), పటేల్ రమేష్ రెడ్డి
17. భువనగిరి (జనరల్)
చామల కిరణ్ కుమార్ రెడ్డి,పున్నా కైలాష్ నేత, పవన్ కుమార్ రెడ్డి