మెదక్‌ లోక్‌సభ స్థానంపై మైనంపల్లి హనుమంతరావు ఫోకస్.. ఏం జరుగుతుందో తెలుసా?

Mynampally Hanumanth Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మెదక్ ఎమ్మెల్యేగా హనుమంతరావు తనయుడు రోహిత్ గెలిచిన విషయం తెలిసిందే.

మెదక్‌ లోక్‌సభ స్థానంపై మైనంపల్లి హనుమంతరావు ఫోకస్.. ఏం జరుగుతుందో తెలుసా?

Mynampally Hanumanth Rao

Updated On : February 6, 2024 / 7:24 PM IST

లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజక వర్గంపై దృష్టి పెట్టారు. ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కార్యకలాపాలు మొదలుపెట్టారు. సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మైనంపల్లి ప్రారంభిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మెదక్ ఎమ్మెల్యేగా హనుమంతరావు తనయుడు రోహిత్ గెలిచిన విషయం తెలిసిందే. గతంలో మెదక్ అసెంబ్లీ నుంచి కూడా మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిధ్యం వహించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరావు.. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీని వీడారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి బరిలో కాంగ్రెస్ తరఫున దిగి ఓడిపోయారు. దీంతో రానున్న ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగేలా ప్లాన్ వేసుకుంటున్నారు.