కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాజమండ్రి : కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అనుభవమున్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. బాబు అనుభవం రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశించానని పేర్కొన్నారు. మార్చి 14 గురువారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ పాలసీని విమర్శిస్తే.. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also : ముఖ్యమంత్రి పదవిపై కోరిక లేదు : పవన్ కళ్యాణ్
’నన్ను వ్యక్తిగతంగా దూషించడానికి నేనేమైనా వేల కోట్లు దోచుకున్నానా’ అని ప్రశ్నించారు. ’నేను ఏం తప్పు చేశాను..నా కష్టాలేంటో మీకు తెలుసా’ అని నిలదీశారు. రాష్ట్రంలోని అన్నదమ్ములు, ఆడపడుచుల గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు. ’భగవంతుడా..నాకు అన్యాయంపై పోరాడే శక్తినివ్వు’ అని కోరుకున్నానని పేర్కొన్నారు.
Read Also : ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?
సూపర్ స్టార్ డమ్ ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు పవన్. తెలంగాణ యువత కోరుకుంటే జనసేన పార్టీ అక్కడి ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తనను కాపు వ్యక్తిగా చూస్తున్నారు..తనకు కులం లేదన్నారు. మతం, ప్రాంతం తరపున తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఒక రక్తం కాదు..ఒక కులం కాదు.. మానవత్వం మనల్ని కలిపిందని చెప్పారు. ప్రజలను భావజాలంతో ఐక్యం చేయాలి కానీ కులాలతో కాదన్నారు. కులాలను విభజించి రాజకీయ చేస్తున్నారని విమర్శించారు.
Read Also : కడప, పులివెందుల ఎంపీ టికెట్లు బీసీలకు ఇస్తారా : జగన్ కు పవన్ సవాల్