టీడీపీ నేత కోసం పోలీసుల వేట

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చు బిగిసింది. కూన రవికుమార్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. పోలీసులు కూన రవి కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 04:12 PM IST
టీడీపీ నేత కోసం పోలీసుల వేట

Updated On : August 27, 2019 / 4:12 PM IST

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చు బిగిసింది. కూన రవికుమార్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. పోలీసులు కూన రవి కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చు బిగిసింది. కూన రవికుమార్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. పోలీసులు కూన రవి కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో అనుచితంగా మాట్లాడారని, బెదిరించారని కూన రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 12 మందిపై సరుబుజ్జిలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సరుబుజ్జిలి పోలీసులు మంగళవారం(ఆగస్టు 27,2019) ఆముదాలవలసకు వచ్చారు. ఆముదాలవలసలో కూన రవికుమార్ లేరు. రవికుమార్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. అందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూన రవికుమార్ అధికారులను హెచ్చరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులను గదిలో వేసి చావగొడతా అని ఆయన వార్నింగ్ ఇచ్చారట. 

తనమీద వస్తున్న ఆరోపణలను కూన రవి ఖండించారు. తాను ఎంపీడీవో కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి హల్ చల్ చేశానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేవలం ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లానని వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. స్పీకర్ తమ్మినేని సీతారం ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారన్న కూన… ఎవరెన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొంటానని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఉద్యోగులను అవమానించారని ఏపీ ఎన్‌జీఓ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని వాపోయారు. కూన రవి బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో వీడియో సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అని.. అలాంటి ఉద్యోగులను అవమానించడాన్ని, వారిపై బెదిరింపులకు దిగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రవికుమార్‌పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరించారు.