రెవె న్యూ లుక్..వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

  • Published By: madhu ,Published On : January 29, 2020 / 02:34 AM IST
రెవె న్యూ లుక్..వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు

Updated On : January 29, 2020 / 2:34 AM IST

రెవెన్యూ కొత్త చట్టంపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం అమలు సాధ్య సాధ్యాలపై కసరత్తు జరుపుతున్నారు. త్వరలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. చట్ట రూపకల్పన కోసం రెవెన్యూ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ త్వరలోనే భేటీ జరుపుతారని అనంతరం స్పష్టత వస్తుందని అంటున్నారు అధికారులు.

అవినీతి కంపు కొడుతున్న రెవెన్యూను సంపూర్ణంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా..తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కూడా సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తోంది. అమలులో ఉన్న కొత్త చట్టాలతో పాటు..కొత్త చట్టంలో ఎలాంటి సంస్కరణలు తేవాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారం సేకరించారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు వివిధ మార్గాల్లో అభిప్రాయసేకరణనను ప్రభుత్వం జరుపుతోంది. 

మనుగడలో ఉన్న 124 చట్టాలు / నియమాలను ఒకే గొడుగు కిందకు తీసుకోవడంతో పాటు..కాలం చెల్లిన చట్టాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం నిర్దేశించిన  టైటిల్ గ్యారంటీ చట్టం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహా చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వం భావంచినా..అది అంత సులువు కాదని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టం ఎలా ఉంటుంది ? ప్రజలతో పాటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా ? ఏకపక్షంగా ఉంటుందా ..అన్నది వేచి చూడాల్సిందే. 

Read More : కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు