Brs : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్? కాంగ్రెస్‌లోకి ఆ ఇద్దరు?

ఇప్పటికే కేకేను కలిసిన ఇద్దరు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

Brs : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్? కాంగ్రెస్‌లోకి ఆ ఇద్దరు?

Shock For Brs

Updated On : April 11, 2024 / 5:11 PM IST

Brs : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగులుతోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే.. ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇద్దరినీ పార్టీలో చేర్చుకోవద్దని కాంగ్రెస్ కేడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే కేకేను కలిసిన ఇద్దరు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ తో అంటీముట్టన్నట్లుగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో చక్రం తిప్పిన నేతలు.. ప్రస్తుతం ఎటూ కానీ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు మంత్రిగా పని చేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ తో అంటీముట్టన్నట్లుగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేకేను కూడా కలిశారు. అయితే, ఇంద్రకరణ్ రాకను కాంగ్రెస్ కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ కేడర్ చాలా గట్టిగా చెబుతోంది.

అటు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే అరవింద్ రెడ్డి రాకను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అరవింద్ రెడ్డి పార్టీలో చేరికను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read : ఈ ఆరు సీట్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్‌.. పార్టీ నుంచి వెళ్లిన నేతలను ఓడించేందుకు..