చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనను సురక్షితంగా వేదిక పైనుంచి తరలించారు.

Chandrababu Narrow Escape

Chandrababu Naidu : రాజమండ్రి టీడీపీ రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో టీడీపీ నాయకులు ఒక్కసారిగి స్టేజ్ మీదకు వచ్చారు. దీంతో వేదికపై స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనను సురక్షితంగా వేదిక పైనుంచి తరలించారు.

Also Read : అంతవరకు పుట్టింటి నుంచి కదలను.. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి..

రాజమండ్రిలో రా కదలిరా భారీ బహింగ సభ నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ మీటింగ్ కు టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కాగా.. సభా వేదికపై ఒక్కసారిగా టీడీపీ, జనసేన నాయకులు, చంద్రబాబు అభిమానులు చొచ్చుకుని వచ్చారు. చంద్రబాబును కలిసేందుకు వారంతా పోటీపడ్డారు. వారిని నియంత్రించడంలో సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

Also Read : పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం

ఈ క్రమంలో స్టేజ్ పై కొంత తోపులాట జరిగింది. ఈ క్రమంలో రా కదలిరా స్టేజ్ మీద నుంచి చంద్రబాబు కిందపడబోయారు. అయితే, వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు వెనక్కి పడిపోకుండా తమ చేతులను అడ్డంగా పెట్టారు. చంద్రబాబు పడిపోకుండా చేతితో పట్టుకున్నారు. దీంతో చంద్రబాబుకి ప్రమాదం తప్పినట్లు అయ్యింది. చంద్రబాబుకి ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.

Also Read : రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ

రాజమండ్రి రూరల్ నియోజకవర్గలో తాపేరులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ జరిగింది. తూర్పు గోదావరికి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన శ్రేణులు తరలి వచ్చాయి. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ, జనసేన ఇంఛార్జ్ లు, నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగం పూర్తయిన తర్వాత టీడీపీ, జనసేన నేతలు ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. చంద్రబాబును కలిసి బొకేలు ఇచ్చేందుకు, శాలువాలు కప్పేందుకు పోటీలు పడ్డారు. మహిళా నేతలు కూడా వేదికపై వచ్చేశారు. వారంతా ఒకరిపై మరొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో స్టేజిపై గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో వారు చంద్రబాబుపైనా పడ్డారు. ఈ క్రమంలో ఆయన స్టేజిపై నుంచి కింద పడబోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. అయితే, వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబు కింద పడకుండా చేతలతో పట్టుకున్నారు. దీంతో చంద్రబాబుకి తృటిలో ప్రమాదం తప్పినట్లు అయ్యింది.