రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ

ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు అని ఆమె అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు.

రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. మహిళ సహా ముగ్గురు పోటీ

padadmalatha anusuri to be ysrcp rajahmundry mp candidate

Updated On : January 29, 2024 / 11:54 AM IST

Padadmalatha Anusuri: రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి ఎంపీ సీటు కోసం వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. రాజమండ్రి ఎంపీ రేసులో ఓ మహిళ సహా ముగ్గురు బీసీ సామాజిక వర్గ నేతలున్నారు. గుబ్బల తులసీకుమార్, డాక్టర్ అనసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎంపీ సీటు కోసం పోటీపడుతున్నారు. గుబ్బల తులసీకుమార్ ఇప్పటికే పలుమార్లు YCP పెద్దలను కలిశారు.

ఎంపీ సీటు దక్కించుకునేందుకు పద్మలత తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పద్మలతకే రాజమండ్రి ఎంపీ సీటు అని ఆమె అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు. ఇక గూడూరి శ్రీనివాస్ ఎంపీ బరిలో నిలిచేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురిలో ఎవరో ఒకరికి సీటు దక్కే అవకాశం ఉంది. బీసీలకే రాజమండ్రి ఎంపీ సీటని ఇప్పటికే ప్రకటించారు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి.