ముఖ్యమంత్రి పదవి మీద కోరిక లేదని.. దాన్ని బాధ్యతగా భావిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
తూ.గో : ముఖ్యమంత్రి పదవి మీద కోరిక లేదని.. దాన్ని బాధ్యతగా భావిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గెలుపోటములు తనకు తెలియవు..యుద్ధం చేయడం ఒకటే తెలుసు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అన్యాయంపై గళమెత్తడానికి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నాలుగు గోడల మధ్య ఉన్న కుర్రాడిని బయటకు వచ్చేలా చేశారని… జనసేన పార్టీని స్థాపించేలా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతున్న పరిస్థితుల్లో తన గుండె ధైర్యమే తనను జనసేన పార్టీ పెట్టేలా చేసిందన్నారు. తెలుగు ప్రజల సుస్థిరత కోసం టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపానని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.
Read Also : ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?
ఐపీఎస్ కు ట్రైనింగ్ తీసుకోవాలి.. కానీ రాజకీయ నేతకు డబ్బులుంటే చాలన్నారు. ’నీకు డబ్బుల్లేవ్…రాజకీయాలను నడపలేవ్’ అని అన్నారని పేర్కొన్నారు. డబ్బు తనకు ఎప్పుడూ ఆనందానివ్వలేదన్నారు. వ్యవస్థలో మార్పు రావాలన్నారు. సమాజం మారాలి..వ్యవస్థ మారాలని పార్టీ పెట్టానని తెలిపారు. 2014లో పార్టీ ప్రారంచినప్పుడు తాను ఒక్కడినేనని ఎవరూ లేరన్నారు. మేధావులు, వేల కోట్లు ఉన్నవారు లేరని చెప్పారు. కానిస్టేబుల్ కొడుకు ఎలా గెలుస్తారు…పార్టీ నడపలేరని అన్నారు. మార్పు రావాలని కోరుకున్న నా అన్నదమ్ములు, ఆడపడుచులు ఉన్నారని..వారికి తాను మాట్లాడేది అర్థమవుతుందని చిత్తశుద్ధిగా నమ్మానని తెలిపారు. ’నేను అడుగు వేస్తే తల తెగిపోవాలి..కానీ అడుగు వెనక్కి వేయను అని అన్నారు.
Read Also : అభివృద్ధి చేస్తారనే కొందరి పల్లకీలు మోశాను : పవన్ కళ్యాణ్
మార్పు తాను కోరుకుంటే వస్తుందా..? 2001, 2009లో వచ్చిందా? రాలేదన్నారు. నాయకులు కోరుకుంటే మార్పు జరుగదని…కాలానుగుణంగా మార్పు వస్తుందన్నారు. రుతువులు వచ్చి వెళ్లిపోయినట్లు మార్పు కూడా అలాగే వస్తుందన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు యువతను వారి భవిష్యత్ కు వాడుకుంటున్నారు..కానీ యువత భవిష్యత్ గురించి మాట్లాడే వారు ఒక్కరు రాలేదన్నారు.
Read Also : కడప, పులివెందుల ఎంపీ టికెట్లు బీసీలకు ఇస్తారా : జగన్ కు పవన్ సవాల్