Pawan Kalyan : నాదెండ్ల మనోహర్‌ను విమర్శించే వారు వైసీపీ కోవర్టులు- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి వెన్నుముక అని, ఆయనను మనం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan – Nadendla Manohar : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. నాదెండ్ల మనోహర్ పై అధికార పార్టీ నేతలు అనేక విమర్శలు చేస్తున్నారన్న పవన్.. మనోహర్ ను తిట్టే వాళ్ళు నన్నే తిట్టండి అని అన్నారు. శత్రువులు తిట్టినా, విమర్శించినా పర్లేదన్న పవన్ కల్యాణ్.. కొందరు పార్టీలోని వారు మనోహర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి వెన్నుముక అని, ఆయనను మనం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కల్యాణ్. మనోహర్ ను విమర్శించే వారు వైసీపీ కోవర్టులు అనుకుంటా అని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, జూన్ నుండి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక ప్రకటన చేస్తామని పవన్ చెప్పారు. చాలా చర్చలు జరిపి పొత్తు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులతో జరిపిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

” పార్టీ నిర్మాణం అనేది కష్టసాధ్యమైనది. అనేక కలలు కని పార్టీని స్థాపించా. పార్టీలో నేను ఓ నాయకత్వ బాధ్యత వహిస్తున్న కార్యకర్తను. పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలని కాదు. మార్పును కోరుకునే వాడిని. డబ్బు లేకుండా రాజకీయం చెయ్యడం సాధ్యం అని నిరూపించాం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఓట్లు కొనకుండా రాజకీయం చెయ్యాలి. డబ్బులు ఖర్చు చెయ్యకుండా కాదు. డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయం అవ్వదు. ఓట్లు కొనకుండా రాజకీయం చెయ్యాలి. ప్రజారాజ్యం పరిస్థితులను తట్టుకుని జనసేన నిలబడింది. నేను ఒక కులానికి నాయకుడిని కాదు. అన్ని కులాలకు సమాన గౌరవం ఇస్తా. కుల రాజకీయాలు చెయ్యను. కొంతమంది నాయకుల్లా సొంత కులమే బాగుండాలని కోరుకోను. NTR పార్టీ పెట్టినప్పుడు నాటి పరిస్థితులు వేరు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు