ఈవీఎంల హ్యాకింగ్‌కు కుట్ర : విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్ కు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 01:59 PM IST
ఈవీఎంల హ్యాకింగ్‌కు కుట్ర : విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్ కు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్ కు కుట్ర జరుగుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చన్న దానిపై ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్‌….20మంది హ్యాకర్లతో మీటింగ్‌ పెట్టారని విజయసాయిరెడ్డి చెప్పారు.

అశోక్ హ్యాకర్లతో మీటింగ్‌ పెట్టినట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. కౌంటింగ్ రోజున (మే 23,2019) ఏం చెయ్యాలి, ఎలా ఈవీఎంలను హ్యాక్ చేస్తే టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనేది హ్యాకర్లతో అశోక్ నాలుగైదు రోజుల కిందట మీటింగ్ పెట్టి చర్చించారనే సమాచారం తమకు అందిందని విజయసాయిరెడ్డి తెలిపారు.
Also Read : ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. అశోక్ ఇప్పటికీ అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఈవీఎంల హ్యాకింగ్ గురించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. హ్యాకింగ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు ఏసీ సీఎం చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ.. ఈసీతో రహస్య మంతనాలు చేస్తూ.. టీడీపీపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఫామ్‌ -7ను దుర్వినియోగం చేసిన వైసీపీ నేతలే… ట్యాంపరింగ్‌ చేయడానికి కూడా సిద్ధమయ్యారని అన్నారు. చేయాల్సింది అంతా చేసి ఇప్పుడా తప్పును ఇతరులపైకి నెడుతున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను అమలు చేస్తున్నారని ఈసీపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని మోడీకి ఓ విధంగా… ఇతరులకు మరో విధంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని కోడ్‌ను ఉల్లంఘించి ప్రసంగాలు చేస్తున్నారని, అది ఈసీకి కనిపించదా అని చంద్రబాబు అడిగారు. ఎన్నికల సంఘానికి అధికార పార్టీ చేసిన తప్పులు కనిపించడం లేదన్నారు.
Also Read : టీడీపీ, వైసీపీ నుంచి పోలీసులు డబ్బులు వసూలు : పెనమలూరు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు