పవన్ కల్యాణ్ ని సీమలో అడుగుపెట్టనివ్వం

ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం

  • Publish Date - August 31, 2019 / 10:06 AM IST

ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం

ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజధానిపై మంత్రులు  తలో మాట మాట్లాడుతున్నారు. దీంతో రాజధాని ఏది అనేదానిపై గందరగోళం, అయోమయం నెలకొంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. ఇది ఇలా ఉంటే.. రాయలసీమకు చెందిన విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. కర్నూలుని రాజధానిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని సాధన కోసం యాక్షన్ ప్లాన్ కూడా ఖరారు చేశారు. 

ఆదివారం(సెప్టెంబర్ 1,2019) నుంచి సీమ జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల ఎదుట ధర్నాలు చేస్తామన్నారు. దిష్టిబొమ్మలు దహనం చేస్తామన్నారు. నేతల పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీరుపై విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. రాజధాని విషయంలో పవన్ రెండు నాల్కల ధోరణిని పక్కన పెట్టాలన్నారు. లేదంటే సీమలో అడుగుపెట్టనీయమని పవన్ కి వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాజధాని విషయంలో అనుమానాలు తలెత్తాయి. రాజధానిగా అమరావతి సేఫ్ కాదని మంత్రి బొత్స చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో మాట అనడంతో ప్రజలు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అయోమయంలో పడిపోయారు. దీంతో రాజధానిలో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి జనసేనాని పవన్ అమరావతిలో పర్యటించారు.  అమరావతిలోని రైతులతో మాట్లాడారు. రూ.1500 కోట్లతో భారీ నిర్మాణాలు చేశాక అమరావతిని రాజధాని కాదంటే ఎలా? అని పవన్ ప్రశ్నించారు. రాజధానిని అమరావతి నుంచి మార్చకూడదని పవన్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో అవసరమైతే పోరాటం చేస్తామని, ప్రధాని మోడీని కలుస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.