వైసీపీ నేతల్లో కలవరం : 2014 సీన్ రిపీట్ అవుతుందా
విజయవాడ: 2019 ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారు.. విజయం మాదే.. అధికారంలోకి రావడం కూడా ఖాయం అనే ధీమా ఇన్నాళ్లూ వైసీపీలో కనిపించేది. అధినేత జగన్ ప్రకటించిన

విజయవాడ: 2019 ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారు.. విజయం మాదే.. అధికారంలోకి రావడం కూడా ఖాయం అనే ధీమా ఇన్నాళ్లూ వైసీపీలో కనిపించేది. అధినేత జగన్ ప్రకటించిన
విజయవాడ: 2019 ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారు.. విజయం మాదే.. అధికారంలోకి రావడం కూడా ఖాయం అనే ధీమా ఇన్నాళ్లూ వైసీపీలో కనిపించేది. అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలే శ్రీరామరక్ష అంటూ నిబ్బరంగా ఉన్నారు. కానీ… ఈ మధ్య కాలంలో మాత్రం వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. అధికారపక్షం ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటే… విపక్ష పార్టీ వైసీపీ మాత్రం కంగారు పడుతోంది. ఇంతకీ వైసీపీ నేతల్ని కలవర పెడుతున్న అంశాలేంటి.. వారి భయానికి కారణం ఏంటి..
పార్టీ ప్లీనరీలో వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలకు మంచి స్పందన వచ్చింది. నవరత్నాల్లోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండేళ్లుగా శ్రమించిన వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. దీంతో… ఎన్నికల్లో గెలుపు సులువే అనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. నవరత్నాలే అధికారంలోకి తెస్తాయనే భరోసా కనిపించింది. కానీ… ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు ఆ పార్టీ నేతల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. మళ్లీ 2014 సీన్ రిపీట్ అవుతుందేమో అనే భయం కనిపిస్తోంది.
ఎన్నికల టైం సమీపిస్తుండటంతో… ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటిస్తోంది. పింఛన్లు పెంపు.. రైతులకు పంట సాయం అంటూ కొత్త స్కీమ్‌లను తెరపైకి తెచ్చింది. ఇవన్నీ జగన్ ప్రకటించిన నవరత్నాల్లోని అంశాలు. అయితే… నవరత్నాల్లో కీలకంగా ఉన్న 2 వేల పెన్షన్, రైతు భరోసా పథకాల్ని ప్రభుత్వం ముందుగానే అమలు చేసింది. ఇక మిగిలిన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటించి అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఇదే అంశం వైసీపీని కలవరపెడుతోంది. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం ముందే అమలు చేస్తుంటే తమ పార్టీకి నష్టం కలుగుతుందేమో అనే ఆందోళన చెందుతున్నారు వైసీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో… ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ను రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు.
ఓవైపు లోలోన ఆందోళన ఉన్నా.. సర్కార్ తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి… చంద్రబాబు కాపీ కొడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఐదేళ్లుగా అమలు చేయని హామీలను.. తమ పార్టీ పథకాలను అమలు చేయడంతోనే చంద్రబాబులో ఓటమి భయం కనిపిస్తుందంటున్నారు. నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టడం తమకే ప్లస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తూనే లోలోన ఆందోళన చెందుతున్నారు.