ముహూర్తం ఫిక్స్ : అమరావతిలో జగన్ గృహప్రవేశం

గుంటూరు: వైసీపీ చీఫ్ జగన్ అమరావతికి తన మకాం మార్చనున్నారు. జగన్ తన శాశ్వత నివాసంలో అడుగుపెట్టనున్నారు. గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. 2019, ఫిబ్రవరి

  • Publish Date - January 29, 2019 / 11:17 AM IST

గుంటూరు: వైసీపీ చీఫ్ జగన్ అమరావతికి తన మకాం మార్చనున్నారు. జగన్ తన శాశ్వత నివాసంలో అడుగుపెట్టనున్నారు. గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. 2019, ఫిబ్రవరి

గుంటూరు: వైసీపీ చీఫ్ జగన్ అమరావతికి తన మకాం మార్చనున్నారు. జగన్ తన శాశ్వత నివాసంలో అడుగుపెట్టనున్నారు. గృహప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. 2019, ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 8గంటల 21నిమిషాలకు జగన్ గృహప్రవేశం చేస్తారు. తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో జగన్ సొంతిల్లు నిర్మించుకున్నారు. ఇంటి సభ్యులు, కొందరు ముఖ్య అతిథుల మాత్రమే గృహప్రవేశానికి వస్తారని సమాచారం. అదే రోజున జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ శ్రేణులంతా హాజరవుతారని తెలుస్తోంది.

 

అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే పార్టీని నడిపించాలని, అక్కడి నుంచే పర్యటనలు, ప్రచారం నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తాడేపల్లిలో శాశ్వత నివాసం నిర్మించుకున్నారు. పాదయాత్ర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు సమరభేరీ మోగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయనున్నారు. అయితే హైదరాబాద్‌లోనే నివాసం ఉంటే ప్రయాణాలకు అధిక సమయం కేటాయించాల్సి వస్తుందన్న ఆలోచనతో అమరావతి నుంచే రాజకీయాలు నడపాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. జగన్ నివాసానికి సమీపంలోనే వైసీపీ ఆఫీస్‌ను కూడా నిర్మించారు. త్వరలోనే వైసీపీ పూర్తి యంత్రాంగం అమరావతికి మారుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

 

* ఏపీలో జగన్ శాశ్వత నివాసం
* తాడేపల్లిలో నూతన గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు
* ఫిబ్రవరి 14, ఉదయం గం8.21నిమిషాలకు గృహప్రవేశం
* ఇంటికి సమీపంలోనే పార్టీ కార్యాలయం
* ఏపీ నుంచే కార్యకలాపాలు