TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది.

TTD

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచేకాక దేశంలోని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రతీరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి. ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాలను టీటీడీ వెల్లడించింది.

 

ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాలు..
♦ ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.
♦ ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
♦ ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
♦ ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
♦ ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
♦ ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
♦ ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
♦ ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరునక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.

 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు..
♦ ఏప్రిల్ 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
♦ ఏప్రిల్ 4, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
♦ ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.
♦ ఏప్రిల్ 12న పౌర్ణమి మ‌రియు ఉత్తర న‌క్షత్రం సంద‌ర్భంగా సాయంత్రం గ‌రుడ వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్రహించ‌నున్నారు.
♦ ఏప్రిల్ 22వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.
♦ ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించ‌నున్నారు.

 

శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు..
♦ ఏప్రిల్ 1న మంగ‌ళవారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
♦ ఏప్రిల్ 4, 11, 18, 25వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.
♦ ఏప్రిల్ 9న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.
♦ ఏప్రిల్ 22న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.