A unique Kubera Raja Yoga after 144 years
కుబేర రాజయోగం అనేది జ్యోతిష్యంలో అత్యంత శక్తివంతమైన, అదృష్టకరమైన రాజయోగాలలో ఒకటి. ఇది సంపద, భోగవిలాసాలు, అధికారం, ప్రాముఖ్యత తీసుకొచ్చే యోగంగా భావించబడుతుంది. హిందూ పురాణాలలో ధనాధికారి అయిన కుబేరుడి పేరు మీద ఈ యోగానికి కుబేర రాజయోగం అని పేరు పెట్టడం జరిగింది. ఈ యోగం గల వ్యక్తి జీవితంలో ధనం, భవ్యమైన జీవనం, సామాజిక గుర్తింపు సులభంగా లభిస్తుందని నమ్మకం. ఈ యోగం ఉన్నవారికి ఎదురే ఉండదు. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వేయిదాలు పడుతున్న పనులకు కూడా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అంత విశిష్టత కలిగిన అద్భుతమైన రాజయోగం ఇది.
కుబేర రాజయోగం ఏర్పడటానికి కొన్ని ముఖ్యమైన గ్రహ యోచనల మధ్య శుభకారకమైన సంబంధాలు ఏర్పడాలి. ముఖ్యంగా..
1.లగ్నేశుడు, ధనస్థానాధిపతి (2వ ఇంటి అధిపతి) శుభగ్రహాలతో సంయోగం లేదా కోణంలో ఉండాలి. 9వ ఇంటి అధిపతి (ధర్మస్థానం) మరియు 11వ ఇంటి అధిపతి (లాభస్థానం) మధ్య శుభ సంబంధం ఉండాలి.
2.బృహస్పతి (Jupiter), శుక్రుడు (Venus) శుభస్థితిలో ఉండాలి. కుబేర యోగంలో వీరి బలస్థితి కూడా చాలా కీలకం.
3.లగ్నం, 2వ ఇల్లు, 5వ ఇల్లు, 9వ ఇల్లు, 11వ ఇల్లు ఇవన్నీ శుభగ్రహాల చేత దృష్టించబడినప్పుడు లేదా శుభస్థితిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతీష్యులా మాట.
1. అపార ధనసంపత్తి:
ఈ యోగం కలిగిన వారు జీవితంలో ఒక స్థాయికి మించి సంపద సంపాదిస్తారు. వ్యాపారం, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, షేర్లు వంటి మార్గాలలో ధనం గణనీయంగా పెరుగుతుంది. ఉన్నత వేతనాలు, లాభదాయక ఉద్యోగాలు, వ్యాపార విజయం సాధించవచ్చు.
2. విలాసవంతమైన జీవితం:
అందమైన, ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన వాహనాలు, విలువైన వస్తువులు సులభంగా పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, బ్రాండెడ్ ఉత్పత్తులు, లగ్జరీ విహారాలు అనుభవించె యోగం దక్కుతుంది.
3. సామాజిక గౌరవం, గుర్తింపు:
కుబేర యోగం వల్ల కేవలం ధనం ఉన్న వ్యక్తిగా కాకుండా, గౌరవనీయమైన వ్యక్తిగా వృద్ధి చెందుతారు. రాజకీయ, సామాజిక లేదా వాణిజ్య రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందుతారు.
4.దాతృత్వం, సత్కార్యాలలో పాల్గొనడం:
కుబేరుడి విధంగా, ఈ యోగం కలిగిన వారు ఇతరులకు సహాయపడతారు. దానధర్మాలు, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల మంచి పేరు, పుణ్యం లభిస్తుంది.
5.మంచి విజ్ఞానం, నాయకత్వ లక్షణాలు:
కుబేర రాజయోగం ఉన్నవారు ఆర్థికంగా మాత్రమే కాదు, మేధస్సు పరంగా కూడా ఉచ్చ స్థితిని పొందుతారు. వ్యాపార నాయకత్వం, ఆర్థిక నిర్ణయాల్లో తీక్షణత, తెలివి సహజంగా కలిగి ఉంటారు.
6.కుటుంబంలో శాంతి, సంతోషం:
ధనం వల్ల కుటుంబానికి అన్ని సౌకర్యాలు, విద్య, ఆరోగ్యం, భద్రత లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం బలపడుతుంది.
7.స్థిరత్వం, భద్రత:
జీవితం లో ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేకుండా స్థిరంగా ధనం సమకూరుతుంది. భవిష్యత్తులో భద్రత కలిగిన జీవితం గడిపే అవకాశం పెరుగుతుంది.
కుబేర రాజయోగం మహత్తరమైనదే కానీ, అది జాతకంలో ఉన్నప్పటికీ అది పూర్తిగా పనిచేయాలంటే మరికొన్ని బలాలు కూడా ఉండాలి. అవే..
కుబేర రాజయోగం ఉన్న వ్యక్తులు సాధారణంగా ధనవంతులు, ప్రసిద్ధులు, శ్రేష్ఠమైన జీవితం గలవారిగా ఎదుగుతారు. అయితే ఇది ఒక్క గ్రహయోగం మాత్రమే కాదు క్రమశిక్షణ, కృషి, ధర్మబద్ధమైన జీవన విధానం కూడా కలిసి ఉంటేనే పూర్తి ఫలితాలు అందిస్తుంది.