Art Director Anand Sai : సనాతన ధర్మం బోర్డు వస్తే.. స్ట్రాంగ్ అవుతాం- ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

పవన్ కల్యాణ్ కి ఒక విజన్ ఉంది. తిరుమల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ కు అనేక ఐడియాలు ఉన్నాయి.

Art Director Anand Sai : హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వివక్షపై ఆయన పోరుబాట పట్టారు. ఇక, ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని భక్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పడాలన్నా.. హైందవ ధర్మాన్ని పరిరక్షించాలన్నా.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాల్సిందేనని పవన్ కల్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు.

ఈ క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశంపై ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎందుకు ఉండాలి, దాని పై ఆయన ఉద్దేశం ఏమిటి, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఆ బోర్డు ఏర్పాటైతే అందులో తన పాత్ర ఎలా ఉంటుంది.. అనే అంశాలపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి స్పందించారు.

”సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక. ఒకవేళ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటైతే దానిపై మీ ఉద్దేశం ఏమిటి? అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఆ బోర్డు పెడితే మీ థాట్స్ ఎలా ఉన్నాయి?”

Also Read : భీష్మ ఏకాదశి విశిష్టత.. తల్లిదండ్రులు ఉన్న వారు కూడా భీష్ముడికి పిండ ప్రదానం చేయొచ్చా..

‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే అంశం.. చాలా మంచిది. బోర్డు ఏర్పాటు కావడం వల్ల ఒక వ్యవస్థ వస్తుంది. మరింత స్ట్రాంగ్ అవుతాం. బోర్డు ఏర్పాటు అనేది ఎవరో ఒకరి దగ్గరి నుంచి స్టార్ట్ అవ్వాలి. అది పవన్ కల్యాణ్ నుంచి ప్రారంభమైంది. బోర్డు ఏర్పాటు కావడానికి కొంత సమయం తీసుకుంటుంది.

పవన్ కల్యాణ్ కి ఒక విజన్ ఉంది. నేను విశ్వకర్మ అని ఆయనకు తెలుసు. తొలిసారిగా ఒక విశ్వకర్మ టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. బోర్డు మెంబర్ గా, ఆర్టిస్ట్ గా, డిజైనర్ గా ఉన్న వాళ్లు ఇదే తొలిసారి. 2047 లో మాస్టర్ ప్లాన్ ఆఫ్ తిరుమలపై డిస్కస్ చేశాం.

ఏదో వెళ్లాము, దర్శనాలు చేసుకున్నాము అనే తత్వం నాది కాదు. తిరుమల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ కు అనేక ఐడియాలు ఉన్నాయి. వెయ్యి కాళ్ల మండపం అభివృద్ధిపై దృష్టి పెడదామన్నారు. తిరుమల ఒక స్థల పురాణం. వెయ్యి కాళ్ల మండపం ఒక అందం. అది ఎక్కడ పెడతాము అనేది బోర్డులో డిసైడ్ చేస్తారు” అని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అన్నారు.