Sri Ujjaini Mahakali Bonalu : ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణ

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనం‌ను అత్తెల్లి కుటుంబసభ్యులు ఈ రోజు సమర్పించారు.

Sri Ujjaini Mahakali Bonalu :  ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణ

Sri Ujjaini Mahakali bonalu

Updated On : July 18, 2021 / 5:56 PM IST

Sri Ujjaini Mahakali Bonalu : సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనం‌ను అత్తెల్లి కుటుంబ  సభ్యులు ఈ రోజు సమర్పించారు. ఎన్నోఏళ్ల నుంచి ఆనవాయితీగా మొదటి బోనం అత్తిలి కుటుంబం నుంచి వెళుతుండగా..జోగిని శ్యామల   బోనమెత్తి అమ్మవారికి నృత్యాల మద్య బోనంను సమర్పించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని     బోనం కు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని బోనం ఊరేగింపులో పాల్గొన్నారు.

డప్పు వాయిద్యాలు,   భక్త జన సందోహం మధ్య బోనం ఉరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించగా..శ్యామల ఎత్తిన మొదటి బోనం చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ ఏడాది కరోన పరిస్థితుల నేపధ్యంలో జాతరకు ఎల్లప్పుడూ నిర్వహించే ఫలహార ఉరేగింపు బండి తమ కుటుంబం నుంచి నిర్వహించడం లేదని..కరోనా తగ్గుముఖం పడితే అంతకు మించి రెట్టింపుగా ఫలహార బండి నిర్వహిస్తామని మంత్రి తలసాని చెప్పారు. కరోన నిబందనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు జాతర లో పాల్గొనాలని మంత్రి కోరారు.