Bathukamma 2023 : నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ ..

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగలో అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది. నాలుగో రోజు బతుకమ్మ ‘నానబియ్యం బతుకమ్మ’.

4th day nanabiyam bathukamma

Bathukamma 2023 4th day : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగలో అప్పుడే నాలుగో రోజు వచ్చేసింది. నాలుగో రోజు బతుకమ్మ ‘నానబియ్యం బతుకమ్మ’. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబురాలు ఆఖరి రోజు అంటే చివరిరోజు సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతాయి. ఈ తొమ్మిది రోజులు ఆడబిడ్డలు తంగేడు, గునుగు,కట్ల, బీర,గుమ్మడి, బంతి,చామంతి వంటి పూలతో బతుకమ్మను పేర్చి పండుగ చేసుకుంటారు. ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగలో అన్ని పూలతో పాటు గడ్డిపూలు కూడా మమేకమైపోతాయి. గడ్డిపూలను కూడా బతుకమ్మ పండుగలో భాగస్వామ్యం కావటమే బతుకమ్మలో మరో విశిష్టతగా చెప్పుకోవాలి. దశమి నవరాత్రికి ముందు రోజు ప్రారంభం అయ్యే బతుకమ్మ పండుగ అంతా ఆనందాలే. అక్కాచెల్లెళ్లంతా ఒకచోట చేరి ఆడిపాడతారు. గౌరమ్మను తమ పాటలతో కొలుస్తారు. తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. సౌభాగ్యాలను కలిగించాలని కోరుకుంటారు.

Dussehra 2023: దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి…?

బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు మరింత ఎక్కువగా విరబూస్తాయి.

బతుకమ్మ పండుగలో అప్పుడే మూడు రోజులు పూర్తి అయ్యాయి. నాలుగోరోజు జరుపుకునే బతుకమ్మ నానెబియ్యం బతుకమ్మ. ఈరోజు గౌరమ్మను చేసి తంగేడు వివిధ పూలతో అలంకరించి, వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు..ఇది నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ప్రత్యేకత..