chandra grahan 2025
Chandra Grahan 2025 : చంద్రగ్రహణం వచ్చేస్తోంది. భాద్రపద పౌర్ణమి రోజున.. అంటే ఆదివారం (సెప్టెంబర్ 7న) రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం (Chandra Grahan 2025) ఏర్పడుతుంది. చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.
చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఆచారాలు.. మంత్ర బలం ఉన్నవారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణం వీడిన తరువాత స్నానం చేస్తారు. గ్రహణం రోజున సూతక కాలం ఆరంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే.. పండ్ల రసం వంటివి తీసుకుంటారు.
Also Read: Total Lunar Eclipse 2025: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఏం చేయాలి? అస్సలు చేయకూడని తప్పులు ఏంటి?
గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం. అయితే, గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం మంచిదని పండితులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం ఆదివారం (7వ తేదీ) రాత్రి 9.58 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారు జామున 1.26గంటలకు ముగుస్తుంది. దాదాపు మూడున్నర గంటలు చంద్రగ్రహణం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు. ఈ సమయాల్లో చాలా మంది బయటకు కూడారారు. ఇంట్లోనే ఉంటారు. మంత్రబలం ఉన్న వారు.. అనుష్టానం చేసుకుంటారు. ఆ సమయంలో చేసే అనుష్టానికి మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే వేల రెట్లు అధికంగా ఫలితం ఉంటుందట.
గ్రహణం ప్రారంభమైన సమయం నుంచి దేవుడి విగ్రహాలను, దేవుడి పటాలను తాకవద్దు. ఆ సమయంలో రాహువు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రహణం రాత్రివేళ ఏర్పడుతుంది కాబట్టి చాలామంది నిద్రపోతుంటారు. అయితే, గ్రహణం పూర్తయిన తరువాత మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వారు ఎలాంటి పనులు చేయాలనే విషయాలను తెలుసుకుందాం..
♦ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం ముగిసిన వెంటనే, సూతకం కూడా ముగుస్తుంది.
♦ గ్రహణం ముగిసిన తరువాత ఇంట్లో గంగాజలాన్ని చల్లాలి. ఒకవేళ.. గంగా జలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి.
♦ ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అలాగే ప్రతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మిదేవి ఉండదు అని చెబుతుంటారు. దీంతో ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి.
♦ గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, గ్రహణం ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.
♦ గ్రహణం తరువాత స్నానం చేయాలి. ఒకవేళ మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై చల్లుకోండి.
♦ స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లడం మంచిది.
♦ గ్రహణం తరువాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఆ తరువాత గంగాజలం చల్లాలి.
♦ గ్రహణానికి ముందు తయారు చేసిన ఆహారాన్ని పూర్తిగా పడేయాలి.
♦ గ్రహణం తరువాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మళ్లీ తాగునీరు తెచ్చుకోవాలి.
♦ గ్రహణం ముగిశాక వెంటనే తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి.