Chardham yatra 2023 : నేటి నుంచి తెరుచుకోనున్న చార్‌ధామ్‌ ఆలయాలు.. శివయ్య నామస్మరణలో మారుమోగిపోనున్న హిమగిరులు

అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌. వీటి సందర్శనే చార్‌ధామ్‌ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ యాత్రకు ఆసక్తి చూపుతుంటారు.

chardham yatra 2023

chardham yatra 2023 :  అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనవి ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌. వీటి సందర్శనే చార్‌ధామ్‌ యాత్రగా పిలుస్తారు. జీవితంలో ఒక్కసారి అయినా ఈ యాత్ర చేయాలనుకుని తపన పడతారు భారతీయులు. భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ యాత్రకు ఆసక్తి చూపుతుంటారు. సాహసంతో పాటు ఆత్మీత్మికత వెల్లివిరిసే అరుదైన అద్భుతమైన యాత్ర ఈ చార్ ధామ్ యాత్ర.  అక్షయ తృతీయ రోజున హరిద్వార్‌ ఆలయం తెరచుకోనుంది. ఏప్రిల్‌ 22న చార్‌ధామ్‌ క్షేత్రాల్లో మొదటిదైన యమునోత్రి ఆలయాన్ని తెరవాలని నిర్ణయించింది ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం. ఏప్రిల్‌ 25న కేథార్‌నాథ్‌, 27న బద్రీనాథ్‌ ఆలయాలు ప్రారంభంకానున్నాయి.

సుమారు 12,000 అడుగుల ఎత్తున పర్వతాల వెంట సాగే ఈ సాహస యాత్ర కఠినమైనది. ఈ చార్‌ధామ్‌లో హిందూ మతంలోని ముఖ్యమైనవాటిలో శైవం, వైష్ణవం, శాక్తేయం మూడూ కలిసి ఉంటడం ఈ యాత్ర విశేషం. ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు ఈ ఆలయాలను భక్తుల కోసం తెరుస్తారు. మిగతా కాలం అక్కడంతా మంచుకప్పేసి ఉంటుంది. అందుకే ఈ ఆలయాలను మూసివేసి ఆరు నెలల తరువాత ఎండాకాలంలో తెరుస్తాయి. వేసవిలో మంచు దుప్పటిని కాస్తం తొలగించుకునే హిమశిఖరాలను చూడడం అనిర్వచనీయమైన అనుభూతి. హిమగిరులపై సూర్యకిరణాలు పడి బంగారు రంగులో మెసిపోయే ఆ మహిమాన్విత గిరులను చూసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం.

 

చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభ సూచనగా, ఓంకారేశ్వర్ ఆలయం ఉఖిమత్ నుంచి కేదార్‌నాథ్‌కు స్వామివారి డోలీ బయలుదేరింది. ఓంకారేశ్వర్ ఆలయం ఉఖిమఠ్ నుంచి కేదార్‌నాథ్ స్వామివారి డోలీ ధామ్‌కు బయలుదేరింది. వందలాది మంది భక్తులు వెంట నడవగా, హర హర మహదేవ శంభో శంకర అంటూ భక్తులు నినదిస్తుండగా, ముందుకు కదిలింది స్వామి వారి డోలి. ఓంకారేశ్వర్‌ ఆలయం నుంచి బయలు దేరిన డోలి మరునాడు గుప్తకాశీలోని విశ్వనాథ ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ పూజలు అనంతరం ఏప్రిల్ 22న యమునోత్రికి అక్కడి నుంచి గౌరీకుండ్‌కు చేరుకుంటుంది. చివరగా కేదార్‌నాథ్‌ ఆలయం వరకు డోలీయాత్ర జరుగుతుంది. ఈ డోలీ వెళ్లిన మార్గంలోనే భక్తులు చార్‌ధామ్‌ క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈయాత్ర పూర్తి చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే యాత్రకు అనుమతినిస్తుంది ప్రభుత్వం.