Tirumala Laddu: శ్రీవారి లడ్డూలపై కీలక వివరాలు తెలిపిన టీటీడీ ఈవో శ్యామలరావు

ఒక ఇంట్లో 5 ఆధార్ కార్డులు ఉంటే పది లడ్డూలు కూడా పొందవచ్చని తెలిపారు.

Tirumala Laddu

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అనేక మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అన్న ప్రసాద కాంప్లెక్స్‌లో నాణ్యత పెంపునకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శ్రీవారి దర్శనంలో భక్తుల నిరీక్షణ సమయాన్ని మూడు గంటలు తగ్గించామని అన్నారు.

సర్వ దర్శనం టోకెన్లు గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తుండగా ఇప్పుడు 1.60 లక్షలు ఇస్తున్నామని వివరించారు. లడ్డూ ప్రసాద నాణ్యత పెంపునకు చర్యలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తున్నామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోకుండానే లడ్డూలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డుపై రెండు లడ్డూలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఒక ఇంట్లో 5 ఆధార్ కార్డులు ఉంటే పది లడ్డూలు కూడా పొందవచ్చని తెలిపారు. దళారీలు లడ్డూలు మిస్ యుజ్ చేస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజిలెన్స్ విభాగం గుర్తించిందని ఈవో శ్యామలరావు తెలిపారు.

ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలు విక్రయం జరుగుతుండగా అందులో లక్ష లడ్డూలు టోకెన్ లేని వారికి వెళ్తున్నాయని చెప్పారు. ఆధార్ కార్డు లేకుంటే లడ్డూలు ఇవ్వరని, రెండే ఇస్తున్నారని దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఇక నుంచి వందల లడ్డూలు తమకే కావాలి అనుకున్న వాళ్లకు కుదరదని స్పష్టం చేశారు.

Also Read: విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్

ట్రెండింగ్ వార్తలు