Srisailam Covid : చంటిపిల్లలున్న తల్లులు శ్రీశైలంకు రావొద్దు

స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతొక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సరిఫ్టికేట్ ను చూపించాల్సి ఉంటుందన్నారు. అలాగే..చంటిబిడ్డల తల్లిదండ్రులు శ్రీశైలం...

Srisailam : చంటిపిల్లలున్న తల్లులు శ్రీశైలానికి రావొద్దని సూచించారు దేవస్థానం ఈవో లవన్న. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళుతారని, శ్రీశైలానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఎందుకంటే..కరోనా కేసులు ఎక్కువుతున్నాయని, కోవిడ్ నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. 2022, జనవరి 08వ తేదీ శనివారం పరిపాలన భవనంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.

Read More : Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

భక్తులకు అందుతున్న సౌకర్యాలు, కరోనా నిబంధనల అమలుపై ఆరా తీశారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతొక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సరిఫ్టికేట్ ను చూపించాల్సి ఉంటుందన్నారు. అలాగే..చంటిబిడ్డల తల్లిదండ్రులు శ్రీశైలం యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు. మిగతా భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా చూడాలని, వారికి అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.

Read More : Assam CM : వరంగల్‌‌లో బీజేపీ సభ..పోలీసుల భారీ బందోబస్తు

యాగశాలలు, లడ్డూ విక్రయశాలల కేంద్రాలు, వసతి విభాగాలు, అభిషేక మండపాలు, వ్యాపార సముదాయాల వద్ద భక్తులు గుమికుండా ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. నిత్యం సెక్యూర్టీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్ర పరిధిలో కోవిడ్ నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా…జరిమానాలు విధిస్తున్నామని ఇన్స్ పెక్టర్ రమణ వెల్లడించారు. దేవస్థానం అధికారులకు, సిబ్బందికి భక్తులు సహకరించాలని ఈవో లవన్న కోరారు.

ట్రెండింగ్ వార్తలు