Statue of Equality : శ్రీరామానుచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఐదో రోజు.. పరమేష్టి, వైభవేష్టి

ఆదివారం తీవ్ర వ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరిగింది.

Jeeyar

Sri Chinna Jeeyar Swamy : జై శ్రీమన్నారాయణ నామంతో ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్‌ మార్మోగుతోంది. అష్టాక్షరీ మంత్రంతో పులకరించిపోతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా, వైభవంగా కొనసాగుతోంది. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ఐదో రోజు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో రెండు కీలక ఘట్టాలు కాగా.. అందులో ఒకటి రామానుజాచార్యుల మహావిగ్రహం జాతికి అంకితం ఇవ్వడం. శనివారం రాత్రి ఆ ఘట్టం భక్తుల ముందు ఆవిష్కృతమైంది. కులం, మతం, విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సాహించాలన్న శ్రీరామానుజ బోధనలు స్మరించుకుంటూ… 216 అడుగులు ఎత్తైన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకార్పణ చేశారు.

Read More : Mahatma Gandhi statue: 8 అడుగుల మహాత్ముని కాంస్య విగ్రహం ధ్వంసం

ఇధిలా ఉంటే…12 రోజుల పాటు జరుగనున్న మహాక్రతువులో భాగంగా ఐదో రోజు పలు కార్యక్రమలు జరుగనున్నాయి. 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం తీవ్ర వ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరిగింది. తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమకుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది.

Read More : Tamil Nadu Governor : గవర్నర్ Vs సీఎం.. తగ్గేదే లే అంటున్న స్టాలిన్

దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగే ఈ 11 రోజులూ… ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని..రోజూ కోటిసార్లు జపించనున్నారు. దీంతో.. దివ్యక్షేత్రం శ్రీరామనగరం.. నారాయణ మంత్రంతో మార్మోగుతుంది.