Statue of Equality : ముచ్చింతల్‌‌లో 8వ రోజు సహస్రాబ్ది ఉత్సవాలు.. 385 మంది ధర్మాచార్యులు

జిమ్స్ మెడికల్ కాలేజీలో నాలుగు విభాగులుగా కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం మహనీయులు యాగశాలను సమతమూర్తిని సందర్శిస్తారని తెలిపారు. దివ్యక్షేత్రాలను కూడా...

Samata

Statue of Equality Sri Chinna Jeeyar Swamy : ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం 8వ రోజు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఐశ్వర్య ప్రాప్తికై శ్రీ లక్ష్మీ నారాయణ ఇష్టి, ఉదయం 10 గంటలకు సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి, 10.30 గంటలకు యాగశాలలో చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ, 10.30 గంటలకు ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు జరుగనుంది. ఇందులో దాదాపు 200 మంది సాధు, సంతులు, పీఠాధిపతులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులు ప్రసంగించనున్నారు.

Read More : Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం, రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరుగనుంది. ధర్మాచార్యులు, వివిధ పీఠాధిపతులు 385 మంది వచ్చారని శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి తెలిపారు. వారందరూ ఉదయం ప్రవచన కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం జిమ్స్ మెడికల్ కాలేజీలో నాలుగు విభాగులుగా కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం మహనీయులు యాగశాలను సమతమూర్తిని సందర్శిస్తారని తెలిపారు. దివ్యక్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం ఉందన్నారు.

Read More : Telangana : 317 జీవో వివాదం, ఉపాధ్యాయసంఘాల నేతల ముందస్తు అరెస్టు

మరోవైపు..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో పంచెకట్టు, తిరునామంతో షా వచ్చారు. ఆశ్రమంలోని విశేషాలను చిన్నజీయర్ స్వామి అమిత్ షా కు వివరించారు. సమతామూర్తి విగ్రహాన్ని అమిత్ షా సందర్శించారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని చెప్పారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా అన్నారు. సనాతన ధర్మం అన్నింటికి మూలం అని, సమతా మూర్తి విగ్రహం.. ఏకతా సందేశాన్ని అందిస్తోందని అమిత్ షా వెల్లడించారు.