Drone Cameras In Tirumala : తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం.. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ వీడియోలు వైరల్

తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం రేగింది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ అయినట్లు తెలుస్తోంది.

Drone Cameras In Tirumala : తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం రేగింది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ అయినట్లు తెలుస్తోంది. ఐకాన్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియోలు అప్ లోడ్ చేసినట్లుగా గుర్తించారు.

శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగిరినా.. విజిలెన్స్ యంత్రాంగం గుర్తించలేకపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోను అప్ లోడ్ చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు.

Also Read..Tirumala Temple Ornaments : కోటి విలువ చేసే కిలో బంగారం.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం

ఆ వీడియోని.. డ్రోన్ కెమెరాతో తీశారా? లేక గూగుల్ నుంచి సేకరించారా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామన్నారు.

అలిపిరి మొదలుకుని శ్రీవారి ఆలయం అదే విధంగా తిరుమలలోని ఇతర పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అదే విధంగా సెక్యూరిటీగా 24 గంటలూ ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉన్నా.. ఒక డ్రోన్ కెమెరా సాక్ష్యాత్తు శ్రీవారి ఆలయం ఎదురుగా ఏదైతే ఆస్తాన మండపం ఉందో ఆ ప్రాంతం నుండి డ్రోన్ కెమెరాతో మొత్తం షూట్ చేశారు.

Also Read..Sri Krishna Birthplace : శ్రీకృష్ణ జన్మస్థల వివాదం..షాహీఈద్గా మసీదులో సర్వేలతో ఏంజరగనుంది? హిందూ,ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..?

మొత్తం శ్రీవారి ఆలయం, ఆలయ పరిసరాలన్నీ కూడా డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ఐకాన్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వీడియోలన్నీ పోస్ట్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం టీటీడీ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు.. వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వారి మీద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ వీడియోలను డ్రోన్ తో తీశారా? లేదా శాటిలైట్(గూగుల్) ద్వారా సేకరించారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల గగనతంలో డ్రోన్ల వినియోగమే కాదు విమానాలు తిరగడంపైనా నిషేధం ఉంది.

ట్రెండింగ్ వార్తలు