Sri Krishna Birthplace : శ్రీకృష్ణ జన్మస్థల వివాదం..షాహీఈద్గా మసీదులో సర్వేలతో ఏంజరగనుంది? హిందూ,ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..?

శ్రీకృష్ణ జన్మస్థల వివాదం విషయంలో షాహీఈద్గా మసీదులో సర్వే చేయాలని కోర్టు పురావస్తు శాఖకు బాధ్యతలు అప్పగించింది.మరి ఈ సర్వేలతో ఏంజరగనుంది? అసలు ఈ వివాదం వెనుకున్న అసలు విషయమేంటీ? హిందూ,ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..?

Sri Krishna Birthplace : శ్రీకృష్ణ జన్మస్థల వివాదం..షాహీఈద్గా మసీదులో సర్వేలతో ఏంజరగనుంది? హిందూ,ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..?

Krishna Janmabhoomi case

Sri Krishna Birthplace In Mathura :  రామజన్మభూమి వివాదం ముగిసిపోయింది. వారణాసి జ్ఞానవాపి మసీదు రచ్చ కంటిన్యూ అవుతోంది. ఈ సమయంలోనే.. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానానికి.. షాహీఈద్గా మసీదుకు మధ్య వివాదంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు.. దేశవ్యాప్తంగా కొత్త చర్చను లేవదీశాయి. మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు సర్వేలతో ఏం జరగబోతోంది. అసలీ వివాదం ఏంటి.. హిందూ, ముస్లీంల మధ్య 1968లో జరిగిన ఒప్పందం ఏంటి..

దేశంలో ప్రస్తుతం వారణాసి-జ్ఞానవాపి వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నో దశాబ్దాల తర్వాత అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడగా ఇప్పుడు మరిన్ని వివాదాలు తెరపైకి వస్తున్నాయ్. నిజానికి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే ! ఐతే అయోధ్య తీర్పు తర్వాత వీటిపై ఫోకస్ ఎక్కువైందని విశ్లేషకులు అంటున్నారు. అటు వారణాసిలో జ్ఞానవాపి మంటలు ఇంకా ఆరనేలేదు. కోర్టుల్లో పంచాయితీ నడుస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో మథురలో మందిర్‌, మసీదు వివాదం కీలక మలుపు తిరిగింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంతానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ స్వీకరించిన మథుర కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదా స్పద స్థలంలో సర్వే నిర్వహించాలని చెప్పింది.

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగాన్ని గుర్తించినట్లే… షాహి ఈద్గా పునాదుల కింద కృష్ణ జన్మభూమి ఉందనేది.. పిటిషనర్లు తెలిపారు. దీనిపై సర్వే చేయాలంటూ మథుర జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ నెల 8వ తేదీన ఈ పిటీషన్లను దాఖలు చేశారు. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ శైలేష్ దూబే ఈ కేసు వాదిస్తున్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. షాహి ఈద్గా స్థలాన్ని సర్వే చేయాలంటూ ఆదేశించింది. జనవరి 2వ తేదీ తర్వాత సర్వే చేపట్టాలని సూచించింది. జనవరి 20నాటికి సర్వే నివేదికలను తమకు అందజేయాలని పురావస్తు శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో తర్వాత విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రాంతంగా దీన్ని నమ్ముతారు. మథురతో పాటు ఆ చుట్టు పక్కల బృందావనం, గోకులం వంటి ప్రాంతాలు ఉన్నాయ్. ఇవన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతాలుగా పురాణ గ్రంథాల్లో ఉంది. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలంగా భావించే 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై అసలు వివాదం మొదలైంది. ఈ స్థలం శ్రీకృష్ణుడిదని…. శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలని పిటిషన్‌దారులు కోరుతున్నారు. ఇక్కడ నిర్మించిన మసీదు 17వ శతాబ్దంలో నిర్మించిందని పిటిషన్‌లో తెలిపారు. 1669-70 కాలంలో ఔరంగజేబ్ ఆదేశాల మేరకు శ్రీకృష్ణుని జన్మస్థలంలో మసీదును నిర్మించారని చెప్తున్నారు.

Sri Krishna Janmabhoomi Row : శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మాణం కేసు..మసీదులో సర్వే చేయాలని మ‌థుర కోర్టు తీర్పు

ఈ స్థల వివాదం సంగతి ఎలా ఉన్నా.. 1968లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వహణ అథారిటీ, షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, ఇక్కడి భూమిని రెండు భాగాలుగా విభజించారు. దీని ప్రకారం ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు అప్పటి ఆలయ అథారిటీ ఒప్పుకుంది. షాహీ ఈద్గా మసీదు 1991నాటి ప్రార్థన స్థలాల చట్టం పరిధిలోకి వస్తుంది. 1947 ఆగస్ట్ 15 నాటికి.. ఈ చట్టంలో తెలిపిన ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో… వాటి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆ చట్టం క్లియర్‌గా చెప్తోంది. ఐతే ఆ ఒప్పందం సరికాదని.. 1968లో మథుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలని పిటిషనర్లు తెలిపారు. దీన్ని విచారణకు స్వీకరించిన మథుర కోర్టు.. వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

రామజన్మభూమి వ్యవహారం తర్వాత.. పాత వివాదాలు కొత్తగా తెరమీదకు వస్తున్నాయ్. వారణాసిలో జ్ఞానవాపి అయినా.. మథురలో షాహీ మసీదు అయినా.. ఈ వివాదాలకు పరిష్కారం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. కాశీవిశ్వనాథ్ ఆలయం, జ్ఞానవాపి అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. ఈ సర్వేలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం లాంటి ఆకారం బయటపడడడం సంచలనంగా మారింది. అది అసలైన శివలింగమేనని హిందూసంస్థలు వాదిస్తుంటే.. అది కేవలం ఫౌంటైన్ మాత్రమే అంటున్నాయి ముస్లిం సంఘాలు. ఆ గొడవ ఇంకా తేలకముందే.. షాహీ ఈద్గా మసీదులో విషయంలోనూ కోర్టు అలాంటి ఆదేశాలే ఇచ్చింది. ఇక్కడ కూడా హిందూ దేవుళ్ల విగ్రహాలు బయట పడుతాయా… పడవా.. ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.