వినాయక చవితి : విగ్రహాలను నిమజ్జనం చేస్తే మొక్కలు మొలుస్తాయి

  • Publish Date - August 30, 2019 / 05:59 AM IST

వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లలో సందడి నెలకొంది. విగ్రహాలు…పూజా సామాగ్రీ కొనుగోలుతో బిజి బిజీగా ఉన్నారు. అయితే…రంగులతో కూడిన విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని..మట్టితో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని అంటున్నారు. అయితే..మంగళూరులో ఉన్న నితిన్ వాజ..వినూత్నంగా ఆలోచించాడు. విగ్రహం నిమజ్జనం చేసిన అనంతరం మొక్కలు వచ్చే విధంగా విగ్రహాన్ని తయారు చేయాలని ఆలోచించాడు. వెంటనే అమల్లో పెట్టేశాడు. ఇతనికి కొంతమంది స్నేహితులు సహకరించారు. 

కాగితాలను రుబ్బి గుజ్జును తయారు చేశారు. దీనికి విత్తనాలు, కూరగాయలు, వివిధ రకాల పళ్లను ఉపయోగించారు. ఒక్కో విగ్రహంలో వివిధ రకాల విత్తనాలను పెట్టారు. నిమజ్జనం అయిన అనంతరం విగ్రహం నీటిలో కరిగిపోతుందని..తర్వాత..మొక్కలు మొలుస్తాయని అంటున్నాడు నితిన్ వాజ. 

సెప్టెంబర్ 02వ తేదీన వినాయక చవితి. పండుగను ఘనంగా జరుపుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూడళ్లలో షెడ్‌లు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహ ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం పండుగలో హైలెట్ అని చెప్పాలి. అయితే..నీటిలో కరిగిపోయి పర్యావరణానికి మేలు జరిగే విగ్రహాలను ఏర్పాటు చేయాలంటున్నారు. అలాగే నితిన్…ఇతని ఫ్రెండ్స్ తయారు చేసిన గణేష్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.

విగ్రహాల తయారీకి ఎలాంటి కలర్స్ వాడలేదని నితిన్ తెలిపాడు. తాము 30 నుంచి 40 విగ్రహాలను మాత్రమే తయారు చేయడం జరిగిందని, ప్రజల నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదన్నారు. కానీ..రాబోయే సంవత్సరాల్లో ఆదరణ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపాడు. గణేశుడి విగ్రహాలతో పాటు పేపర్ పెన్నులు తయారు చేసినట్లు..ఇందులో కూడా విత్తనాలు ఉన్నాయన్నారు.